ముఖంపై చిన్న మచ్చ ఉన్నా సరే ఎంతగానో మదన పడిపోతూ ఉంటారు.మచ్చ అందాన్ని దెబ్బ తీస్తుందని నమ్మడమే అందుకు కారణం.
అవును, చంద్రబింభం లాంటి ముఖంపై మచ్చలు పడితే.అందం ఖచ్చితంగా దెబ్బ తింటుంది.
అందుకే ఆ మచ్చలను నివారించుకోవడం కోసం ఏవేవో క్రీములు వాడుతుంటారు.అయితే ఒక్కోసారి ఎన్ని రకాల క్రీములు వాడినా మచ్చలు పోనేపోవు.
అటువంటి మొండి మచ్చలను ఈజీగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు కొన్ని ఉన్నాయి.వాటిని పాటిస్తే మొండి మచ్చలకు సులభంగా బై బై చెప్పొచ్చు.
మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు , అర కప్పు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పును మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ టమాటో రసం, వన్ టేబుల్ స్పూన్ బంగాళదుంప రసం వేసి బాగా మిక్స్ చేసి.
దూది సాయంతో ముచ్చలపై అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక.వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే ఎంతటి మొండి మచ్చలైనా పరార్ అవ్వడం ఖాయం.

అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ తోనూ మొండి మచ్చలను దూరం చేసుకోవచ్చు.అందుకోసం అర గ్లాస్ వాటర్‌లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను మిక్స్ చేసుకుని స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.మచ్చలు ఉన్న చోట ఈ స్ప్రేను యూజ్ చేసి.డ్రై అయిన తరువాత నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేసినా మొండి మచ్చలు మాయం అవుతాయి.