అవును అతడొక మగ సావిత్రి.మద్యం మత్తులో ప్రపంచాన్ని మరిచిపోయి ప్రేమ దొరకక ఈ జీవితాన్ని చాలించింది సావిత్రి.
సేమ్ అలాంటి ఒక జీవితాన్ని జీవించాడు ఇక్కడ మన కలల రాకుమారుడు కేవలం కలల రాకుమారుడు అంటే తక్కువే అవుతుంది.హీరోయిన్లకు కూడా అతడే కలలు రాకుమారుడు అతడు మరెవరో కాదు ఎన్టీఆర్ ని, అక్కినేని మించి స్టార్ హీరో అవుతాడు అనుకున్నా హరనాథ్.
పూర్తి పేరు బుద్దరాజు వెంకట అప్పల హరనాథరాజు.అతడే అప్పటి శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు.
స్వయంగా ఎన్టీఆర్ తీసిన సీతారామ కళ్యాణం సినిమాలో రాముడిగా నటించిన మెప్పించాడు.అలాగే ఎన్టీఆర్ కోరాడని భీష్మ సినిమాలో శ్రీ కృషుని అవతారం ఎత్తాడు.
అలా అప్పటి అగ్ర హీరోలలో హర నాథ్ కూడా ఒకడు.ఏకంగా హీరోయిన్స్ అందరికీ కూడా అతడే కలలు రాకుమారుడు.
అప్పట్లో జమునతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి.కానీ మద్యం మత్తు అతడిని కాటేసింది.
వాస్తవానికి ఈ 1962 నుంచి 71 వరకు హరినాథ్ కి ఒక స్వర్ణ యుగం లాంటి సమయం.లెక్కలేనన్ని హిట్స్ ఆ సమయంలో హరనాథ్ కి వచ్చాయి.
వాస్తవానికి అతడు హీరో కావాలనుకోలేదు.చూడడానికి అందంగా ఉంటాడు కాబట్టి ఓ నిర్మాత సరదాగా హీరో వేషం ఉంది వస్తావా అని అడగగానే ఒప్పుకొని నటించాడు.
తరువాత తన అందంతో నటనతో మంచి సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.

కానీ ఎంతటి పేరు వచ్చిందో అంతటి దురాలవాట్లు కూడా వచ్చి చేరాయి.ఎస్విఆర్ వంటి నటుడితో కలిసి కూర్చొని తాగడం అతడు చేసిన తప్పు.సరదాగా మొదలైన ఈ సావాసం చివరికి అతడిని వ్యసనపరుడిగా మార్చేసింది.
మరో ఎన్టీఆర్ కావలసిన అతడు మరో ఎస్విఆర్ అయ్యాడు.అతడి స్థానాన్ని కృష్ణ శోభన్ బాబు వంటి నటులు లాగేసుకున్నారు.
చివరికి చిరంజీవి నాగు సినిమాలో 1984లో డైలాగులే లేని ఒక అనామక పాత్ర పోషించి కేవలం 53 ఏళ్ల వయసులో ఈ ప్రపంచాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయాడు.ఈరోజు హరినాథ్ పుట్టినరోజు కానీ ఇండస్ట్రీలో ఎవ్వరికి ఈరోజు గుర్తులేదు.