ప్రతిఒక్కరూ రైలు ప్రయాణం చేసి ఉంటారు.రైలు ప్రయాణం చేయని వారంటూ ఎవరూ ఉండరు.
రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.సీట్లు పెద్దగా ఉండటంతో పాటు వాష్ రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఇక ట్రైన్ లో స్సేస్ చాలా ఎక్కువగా ఉండటంతో పాటు నిద్రపోవడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.అందుకే బస్సు కంటే ట్రైన్ జర్నీని ఎక్కువమంది ఇష్టపడతారు.
బస్సు ప్రయాణం అయితే చాలా ఇరుకుగా , ఇబ్బందికరంగా అనిపిస్తుంది.రాత్రి ప్రయాణాల్లో కూడా నిద్రపోవడానికి అంతగా వీలు ఉండదు.
అదే రైలు ప్రయాణాల్లో అయితే అలాంటి ఇబ్బంది అసలు ఉండదు.
అయితే రైలు ప్రయాణం గురించి చాలా అనుమానాలు ఉంటాయి.
రైలు బ్రేక్ సడెన్ గా ఎందుకు వేయరు అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది.దానికి కారణం ఉంది.
రైలులో బోగీలన్నీ ఒక దానికోకటి కలిసి ఉంటాయి.ఇంజిన్ వేగం ఒక్కసారిగా తగ్గిస్తే మిగతా బోగీలు కూడా అదే దిశలో కదిలి ఒకదానిపై ఒకటి ఎక్కే అవకాశాలు ఉంటాయి.
ట్రైన్లలో వాక్యుం ప్రెజర్ ద్వారా అన్ని బోగీలు ఒక ట్యూబ్ ద్వారా కలిసి ఉంటాయి.పీడనం తగ్గించడం ద్వారా బ్రేక్ ఉపయోగంలోకి వస్తుంది.
బోగీలలో ఉండే వ్యక్తుల, గార్డ్, డ్రైవర్ వద్ద ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టం ఉంటుంది.ఒకేసారి బ్రేక్ వేయడం ద్వారా రైలు పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది.
అందుకే బ్రేక్ వేస్తే 500 మీటర్ల నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ట్రైన్ ఆగుతుంది.ఒకేసారి సడెన్ బ్రేక్ వేస్తే ట్రైన్ లోకి ప్రయాణికులకు ప్రమాదమే.
బోగీలు ఢీకొట్టి పెను ప్రమాదం జరుగుతుంది.ట్రైన్ కింద పడి చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు.
ట్రైన్ కు ఎదురుగా వచ్చి ఆత్మహత్యకుక ప్రయత్నిస్తారు.ఇలాంటి సమయంలో ఒకరి కోసం సడెన్ బ్రేక్ వేస్తే ట్రైన్ లోని ప్రయాణికులఅందరి ప్రాణాలకు ముప్పే.
అందుకే సడెన్ బ్రేక్ వేయరు.