ప్రస్తుతం ఒక సినిమాని విడుదల చేస్తున్నారంటే సినిమాకి ఏ స్థాయిలో ప్రమోట్ చేయాలో అదే స్థాయిలో సినిమా గురించి ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్తున్నారు.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొనడం అలాగే ట్రైలర్ లాంచ్ వేడుకలు ఫ్రీ రిలీజ్ వేడుకలు అంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాని జనాలలోకి తీసుకువెళ్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.కొన్ని సినిమాలు చూస్తేనే అవి ఫ్లాప్ అవుతాయని అందరికీ అర్థమవుతుంది.
ఇలా ఫ్లాప్ అయ్యే సినిమా వేడుకలకు రావాలంటే ఎంతో అసహనం వేస్తుందని,ఆ సినిమా ఫ్లాప్ అని తెలిసినప్పటికీ సినిమా అద్భుతంగా ఉంటుంది మంచి విజయం సాధిస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన సినిమా వేడుకల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఇక కార్తికేయ2 సినిమా గురించి ఈయన మాట్లాడుతూ… ప్రొడ్యూసర్స్ రాసి పెట్టుకోండి ఈ సినిమా తెలుగు భాషలో ఎంత వసూళ్లను రాబడుతుందో హిందీ భాషలో కూడా అదే వసూళ్లు రాబడుతుందని విజయ ప్రసాద్ పేర్కొన్నారు.ఈ సినిమా ట్రైలర్ చూశాను ఎంతో అద్భుతంగా ఉంది ఈ సినిమా పక్క హిట్ అవుతుందని ఇందులో నిఖిల్ అనుపమ ఎంతో అద్భుతంగా నటించారంటూ ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు కురిపించారు.
మొత్తానికి సినిమాల గురించి ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.