క్యాసినో డాన్ చికోటి వ్యవహారంపై మాజీమంత్రి కొడాలి నాని స్పందించారు.టిడిపి నేతలకు దమ్ముంటే క్యాసినో వ్యవహారంలో ఈ.
డి ద్వారా తనను అరెస్టు చేయించాలనీ కొడాలి నాని సవాల్ విసిరారు.బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టేలా , చికోటి పై ఈడి తనిఖీలను టిడిపి బ్యాచ్ తమకు ఆపాదిస్తుందనీ, గుడివాడలో క్యాసినో అంటూ వచ్చిన టిడిపి నిజ నిర్ధారణ కమిటీ నివేదికలు ఈ.డి కు అందించాలనీ ఆయన అన్నారు.దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం, జగన్ కు మాకు ముడి పెడుతుందని,ఆయన మండి పడ్డారు.