ఫోన్‌ లిఫ్ట్ చేయగానే అందరూ హలో అంటారు కదా.. ఇంతకీ దాని అర్థం ఎంతమందికి తెలుసు?

మనం సాధారణంగా అనేక విషయాలను పట్టించుకోము.కానీ మనకు తెలియని ఎన్నో విషయాలు కాలగర్భంలో కలిసిపోతుంటాయి.

 Everyone Says Hello When They Pick Up The Phone, How Many People Know What It Me-TeluguStop.com

అయితే మనలో కొంతమంది మాత్రం ప్రతి విషయం మీద అవగాహన పెంచుకొని జ్ఞానసముపార్జన చేస్తూ వుంటారు.మనం నిత్యం ఫోనులో వాడే ఒక మాట హలో. దీనిని ఒక పలకరింపుగానే మనం అనుకుంటాం తప్ప, దీనివెనుక ఓ కథ దాగి ఉంటుందని అస్సలు అనుకోము.కానీ దానికి ఓ అందమైన కథ వుంది.

ఇపుడు దానిగురించి తెలుసుకుందాం.

మనం ఎవరికైనా ఫోన్ చేసినా లేదా మనకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మొదట వాడే మాట హలో.ముఖ్యంగా చెప్పుకోవాలంటే హలో అనేది ఒక స్త్రీ పేరు.అవును… ఫోన్ ను కనిపెట్టిన తర్వాత గ్రహంబెల్ మొట్టమొదటగా తన భార్యకు ఫోన్ చేసి “హలో” అని పిలిచారట.అక్కడ మొదలైన హలో అలా అలా విశ్వవ్యాప్తం అయిపోయింది. గ్రహంబెల్ 1847 మార్చి 3 న స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్ లో జన్మించారు.ఆయన బాల్య జీవితమంతా బ్రిటీష్ పౌరుడిగానే గడిచింది.గ్రాహంబెల్‌ తాత, తండ్రి వక్తృత్వం, సంభాషణల విషయాలపై పరిశోధనలు చేస్తుండేవారు.

Telugu British, Graham Bell, Phone-Latest News - Telugu

గ్రాహంబెల్‌ తల్లి వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో గ్రాహంబెల్‌ సంజ్ఞలతో కూడిన భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు.ఆమె నుదిటి ఎముకకు దగ్గరగా ఒక రకమైన ఉచ్ఛారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు.ఆపై ఎడింబరో విశ్వవిద్యాలయంలో ధ్వని, వినికిడి శాస్త్రాలు చదివి ‘గాత్ర సంబంధిత శరీర శాస్త్రం’ (వోకల్‌ ఫిజియాలజీ)లో ప్రొఫెసర్‌గా చేరాడు.పగలంతా బోధిస్తూ, రాత్రంతా మేలుకుని ప్రయోగాలు చేసేవాడు.

ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్‌ను కనిపెట్టగలిగాడు.దీనిపై 1876లో ఆయనకు లభించిన పేటెంట్‌ అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube