తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంతో నిలిచే శ్రీ రెడ్డి ఈ మధ్యకాలంలో పూర్తిగా మారిపోయింది.
ఎందుకంటే శ్రీ రెడ్డి ఈ మధ్యకాలంలో వివాదాలకు దూరంగా ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి అందులో సరికొత్త మైన పల్లెటూరి వంటకాలను చేసి చూపిస్తూ ప్రేక్షకులకు చేరువ అవుతుంది.
తరచూ ఏదో ఒక వంట వీడియోలు షేర్ చేస్తూనే ఉంది శ్రీ రెడ్డి.అంతేకాకుండా ప్రస్తుతం శ్రీరెడ్డి వంట వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ రెడ్డి బోటి కర్రీ ని చేసింది.అయితే బోటీ కర్రీని ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి అన్నది చూపిస్తూ అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ క్రమంలోనే వంటకు సంబంధించిన విషయాలను చెబుతూనే అలాగే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తనకి ఎదురైన అనుభవాల గురించి పంచుకుంది.ఈ నేపథ్యంలోనే లవ్ మ్యారేజ్ మంచిదా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ మంచిదా అని అడగగా శ్రీ రెడ్డి మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహమే చాలా మంచిది అని అంటుంది.
ఒకప్పుడు ప్రేమ వివాహాల్లో ప్రేమ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ప్రేమ కాదు.
కేవలం అట్రాక్షన్ మాత్రమే.ఆప్షన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎమోషనల్ గా వీక్ అయిపోతున్నారు.అందువల్ల ప్రేమ వివాహాలను నేను ప్రిఫర్ చేయను.
కొన్ని రోజులు వాడుకొని మోజు తీరిపోయిన తర్వాత మోసం చేసి వదిలేస్తున్నారు.ఇలా రోజుకి ఇలా మోసపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది అని తెలిపింది శ్రీరెడ్డి.
హైదరాబాదులో ఒక అమ్మాయి జీవితం గురించి చూశాను ఆమె సింగిల్ పేరెంట్.ఆమె పెళ్లి కాకుండానే గర్భవతి అవ్వడంతో గర్భవతి అయిన తర్వాత నమ్మించి చివరికి ఆ కడుపు తీయించుకునే స్టేజ్ కూడా దాటిపోయింది.
లోపల పిండాన్ని తీసేస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదం అని చెప్పడం వల్ల ఆమె అలాగే ఉండిపోవాల్సి వచ్చింది.పెళ్లి కాకుండానే కడుపు రావడంతో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి తల్లిదండ్రులు తరిమేశారు.
అలా అమ్మాయి అటు ఇటు కాకుండా అయిపోయింది అలా ఆమె జీవితాంతం ఆ మచ్చని మోస్తూనే ఉండాలి అని తెలిపింది శ్రీరెడ్డి.మోసపోయిన ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ నిలదీయగా, నేను ఏమి చేయలేని పరిస్థితి అంటూ చేతులు ఎత్తేసి సింపుల్ గా సారీ చెప్పేసాడట.
అందువల్లే వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని చెబుతోంది శ్రీ రెడ్డి.