రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘనవిజయం సాధించారు.దీంతో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.
ఈ నేపథ్యంలో అయిష్టంగానే టీఆర్ఎస్ నేతలు ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ముర్ముకు శుభాకాంక్షలు చెప్తూనే పలు డిమాండ్లను ఆమె ముందు ఉంచారు.
గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్మును కోరారు.మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని.మారిన జనాభా శాతం ప్రకారం గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించేందుకు రాష్ట్రపతి కృషి చేయాలని కేటీఆర్ కోరారు.గిరిజన రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని, రాష్ట్రం పంపిన తీర్మానాన్ని అమలు చేసేలా చూడాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుపైనా కేంద్రాన్ని ఒప్పించాలని ద్రౌపదీ ముర్ముకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో ఉందని.అందుకు తామెంతో గర్విస్తున్నామని కేటీఆర్ తెలిపారు.తెలంగాణ పల్లెల్లో ఎక్కడా విద్యుత్ గోసలు లేవన్నారు.ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి స్వీకరించిన రోజే ఆమె సొంత ఊరుకు కరెంట్ వచ్చిందని.
కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు.గత 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన దానికంటే కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఎన్నో రెట్లు ఎక్కువ ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదని, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

అయితే రాష్ట్రపతిగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే తన ముందు మంత్రి కేటీఆర్ పెట్టిన డిమాండ్లను ముర్ము స్వీకరిస్తారా.అసలు కేటీఆర్ వ్యాఖ్యలు ఆమెను చేరతాయా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.కాగా రాష్ట్రపతిగా గెలుపొందగానే ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి ప్రధాని మోదీ అభినందించారు.
అటు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ముర్ముకు అభినందనలు తెలియజేశారు.