స్టార్ కమెడియన్ అలి ప్రముఖ ఛానెల్ లో అలితో సరదాగా షో హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్ దాకా సత్తా చాటుతూ వస్తున్న అలి లేటెస్ట్ గా ఈ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ఈ క్రమంలో అలితో సరదాగా షోకి ఈవారం గెస్ట్ గా రెజినా కసాండ్రా వచ్చింది.ఈమధ్య సినిమాలతో కాకుండా వెబ్ సీరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న రెజినా లేటెస్ట్ గా ఆహాలో అన్యాస్ ట్యుటోరియల్ చేసింది.
సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.అలితో సరదాగా షోలో పాల్గొన్న రెజినా తన కెరియర్ కు సంబందించిన విషయాలతో పాటుగా తన స్కూల్ టైం లో జరిగిన విశేషాలను పంచుకుంది.
అయితే అలితో సరదాగా షోలో సెలబ్రిటీస్ మీద వచ్చిన రూమర్స్ గురించి కూడా ప్రశ్నలు అడుగుతాడు.ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన రెజినా ఎందుకు సినిమాల్లో రాణించలేకపోయింది.
మెగా హీరోతో ఆమె ప్రేమాయణంలో ఎంతవరకు నిజం ఉంది లాంటి ప్రశ్నలు అలి అడుగుతారని ఆశించారు.కానీ అలి ఆమె ముద్దు పేరు.ఆమె క్లాస్ లో ఆటపట్టించిన వ్యక్తి గురించి ఇలా అనవసరమైన స్టఫ్ అడిగారు.
అయితే ముందే రెజినా తన లవ్ స్టోరీ రూమర్స్ గురించి ప్రశ్నలు అడగకండి అని చెప్పి ఉండొచ్చు లేకపోతే మెగా మేనల్లుడితో రెజినా లవ్ స్టోరీ అప్పట్లో హాట్ టాపిక్ మరి అలాంటిది రెజినాని అలి ఆ క్వశ్చన్స్ అడగకపోవడం ఏంటని ప్రేక్షకులు డౌట్ పడుతున్నారు.ఏది ఏమైనా రెజినా ఇంటర్వ్యూ ప్రోమో ఆకట్టుకుంది.మరి ఫుల్ ఇంటర్వ్యూలో అయినా ఆమె లవ్ స్టోరీ గురించి అలి ఏమైనా ప్రశ్నలు అడుగుతారేమో చూడాలి.
బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ షోగా నడుస్తున్న అలితో సరదాగా షోలో ఒకప్పటి తారలందరిని తెచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటారు.ఈ ఇంటర్వ్యూస్ కోసం ఓ స్పెషల్ టీం పనిచేస్తుంది.
తారలకు సంబందించిన విషయాలను వారికి తెలియకుండా తెలుసుకుని ఇంటర్వ్యూలో వారికి సర్ ప్రైజ్ ఇస్తారు.