వైరల్: మ్యాథ్స్‌లో 6 మార్కులు సంపాదించిన కొడుకు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి?

“పుత్రోత్సాహము తండ్రికి.పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా.

 Viral Video Father Cries After Son Scores Only Six Marks In Maths In China Detai-TeluguStop.com

పుత్రుని కనుగొని పొగడగ.పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” ఈ పద్యం అందరికీ తెలిసినదే.

సుమతీ శతక కర్త ‘బద్దెన’ చెప్పినట్టు.పుత్రుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు.ఆ పుత్రుడ్ని నలుగురు పొగిడేటప్పుడు కలుగుతుందని అర్ధం కదా.ఇప్పుడు ఈ పద్యం ఎందుకని అంటారా? మరెందుకాలస్యం, కథలోకి వెళ్ళిపోదాం.గణితంలో ఓ మోస్తారు మార్కులు మాత్రమే సంపాదిస్తున్న కుమారుడి కోసం రంగంలోకి దిగాడు తండ్రి.ఎన్ని పనులు ఉన్నా.బేఖాతరు చేయకుండా అతడికి పాఠాలు చెప్పాడు.అయితే.చివరికి ఖంగు తిన్నాడు.

విషయంలోకి వెళితే, చైనాకు చెందిన ఓ వ్యక్తికి తన కొడుకు లెక్కల్లో వీక్ అనే విషయం అర్థమైంది.

దాంతో అతడికి.స్వయంగా శిక్షణ ఇచ్చి మంచి మార్కులు సాధించేలా కలలుకన్నాడు.

అనుకున్నదే తడవుగా అర్ధరాత్రి వరకూ కుమారుడితోనే గడుపుతూ గణిత పాఠాలు భోదించాడు.ఇలా ఓ సంవత్సరం పాటు ప్రత్యక శిక్షణ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎగ్జామ్స్‌లో తన కొడుకు అత్యత్తమ మార్కులు సాధిస్తాడని ఆశపడ్డాడు.అయితే అతడి ఆశలు నల్లేరుమీద నడకమాదిరి తయారయ్యాయి.

లెక్కల్లో తన కుమారుడికి 100కు కేవలం 6 మార్కులే రావడంతో ఆ తండ్రి తీవ్ర మానసిక క్షోభకి గురయ్యాడు.

దాంతో ఏడాది పాటు ఎంతో శ్రమించి ఇచ్చిన శిక్షణ వృధా అయిందని వెక్కి వెక్కి ఏడ్చాడు.ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… తండ్రి దగ్గర శిక్షణ తీసుకోవడానికి ముందు ఆ కుర్రాడికి లెక్కల్లో మంచి మార్కులే వచ్చాయట.కొంచెం అటుఇటుగా 100కు 40 నుంచి 50 మార్కులు వచ్చేవట.

అయితే తండ్రి శిక్షణతో ఆ డబుల్ డిజిట్ మార్కులు కాస్త సింగల్ కి మారేసరికి తండ్రి భావోద్వేగానికి గురయ్యాడట.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అది చూసి నెటిజన్లు.ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube