ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్న నాయుడుకు గౌరవ అవమానం జరిగింది.ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మోధీ పర్యటనను విజయవంతం చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశాయి.ఈ మేరకు అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని పార్టీల నేతలను సభకు హాజరు కావలసిందిగా లేఖలు అందాయి.
ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు .ఇంతవరకు బాగానే ఉన్నా టిడిపి తరఫున ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్న నాయుడుని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం చెప్పేందుకు హెలికాప్టర్ వద్దకు రావలసిందిగా ఆహ్వానం అందింది.అయితే జిల్లా కలెక్టర్ కు అందిన జాబితాలో అచ్చెన్న నాయుడు పేరు లేకపోవడంతో ఆయనను అధికారులు అడ్డుకున్నారు.దీంతో ప్రధానికి స్వాగతం చెప్పేందుకు హెలికాప్టర్ వద్దకు వచ్చిన అచ్చెన్న నాయుడు వెనతిరిగి వెళ్ళిపోయారు.
ప్రధాని భద్రతను పరిరక్షించే ఎ స్పీజీకి ఇచ్చిన జాబితాలోనూ అచ్చెన్న నాయుడు పేరు ఉంది.అయితే తనకు ఇచ్చిన జాబితాలో అచ్చెన్న నాయుడు పేరు లేదని కలెక్టర్ చెప్పడంతో, అచ్చెన్న హోటల్ కే పరిమితం అయిపోయారు.
తనను రావాల్సిందిగా ఆహ్వానించి ఇప్పుడు ఈ విధంగా అవమానించడం తో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తన పేరు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.
వైసిపి నాయకుల ఆదేశాలతోనే ఈ విధంగా చేశారని, టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రధాని సభ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు.ఆయన రాకపోయినా, పార్టీ శ్రేణులు హాజరు కావలసిందిగా ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.ఇక వైసీపీ అధినేత ,ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం లో విమానం దిగినప్పటి నుంచి మళ్లీ భీమవరం పర్యటన ముగించుకుని గన్నవరంలో విమానం ఎక్కే వరకు ఆయన వెంటే ఉండబోతూ ఉండడం తో వైసీపీ వ్యతిరేక పార్టీల నేతలు తమకు ఆహ్వానాలు అందినా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.