వైరల్: మ్యాథ్స్‌లో 6 మార్కులు సంపాదించిన కొడుకు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి?
TeluguStop.com
"పుత్రోత్సాహము తండ్రికి.పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా.
పుత్రుని కనుగొని పొగడగ.పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!" ఈ పద్యం అందరికీ తెలిసినదే.
సుమతీ శతక కర్త 'బద్దెన' చెప్పినట్టు.పుత్రుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు.
ఆ పుత్రుడ్ని నలుగురు పొగిడేటప్పుడు కలుగుతుందని అర్ధం కదా.ఇప్పుడు ఈ పద్యం ఎందుకని అంటారా? మరెందుకాలస్యం, కథలోకి వెళ్ళిపోదాం.
గణితంలో ఓ మోస్తారు మార్కులు మాత్రమే సంపాదిస్తున్న కుమారుడి కోసం రంగంలోకి దిగాడు తండ్రి.
ఎన్ని పనులు ఉన్నా.బేఖాతరు చేయకుండా అతడికి పాఠాలు చెప్పాడు.
అయితే.చివరికి ఖంగు తిన్నాడు.
విషయంలోకి వెళితే, చైనాకు చెందిన ఓ వ్యక్తికి తన కొడుకు లెక్కల్లో వీక్ అనే విషయం అర్థమైంది.
దాంతో అతడికి.స్వయంగా శిక్షణ ఇచ్చి మంచి మార్కులు సాధించేలా కలలుకన్నాడు.
అనుకున్నదే తడవుగా అర్ధరాత్రి వరకూ కుమారుడితోనే గడుపుతూ గణిత పాఠాలు భోదించాడు.ఇలా ఓ సంవత్సరం పాటు ప్రత్యక శిక్షణ ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎగ్జామ్స్‌లో తన కొడుకు అత్యత్తమ మార్కులు సాధిస్తాడని ఆశపడ్డాడు.
అయితే అతడి ఆశలు నల్లేరుమీద నడకమాదిరి తయారయ్యాయి.లెక్కల్లో తన కుమారుడికి 100కు కేవలం 6 మార్కులే రావడంతో ఆ తండ్రి తీవ్ర మానసిక క్షోభకి గురయ్యాడు.
"""/" /
దాంతో ఏడాది పాటు ఎంతో శ్రమించి ఇచ్చిన శిక్షణ వృధా అయిందని వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.తండ్రి దగ్గర శిక్షణ తీసుకోవడానికి ముందు ఆ కుర్రాడికి లెక్కల్లో మంచి మార్కులే వచ్చాయట.
కొంచెం అటుఇటుగా 100కు 40 నుంచి 50 మార్కులు వచ్చేవట.అయితే తండ్రి శిక్షణతో ఆ డబుల్ డిజిట్ మార్కులు కాస్త సింగల్ కి మారేసరికి తండ్రి భావోద్వేగానికి గురయ్యాడట.
ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అది చూసి నెటిజన్లు.
ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
ఆ విషయం తెలిసుంటే బేబీ జాన్ లో నటించేదాన్ని కాదు.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్!