సినీ ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటుంది.అయితే హీరోల రెమ్యూనరేషన్ సినిమాల్ని నిండా ముంచేస్తున్నాయి అన్న విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
కేవలం పెద్ద హీరోలే మాత్రమే కాకుండా చిన్న హీరోలు కూడా అనూహ్యంగా రెమ్యూనరేషన్ లను పెంచేస్తూ నిర్మాతలను ఇబ్బందులు పెడుతున్నారని ఒక విమర్శ.కాగా మరి కొంతమంది హీరోలు సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుతున్నారని మరొక విమర్శ కూడా వినిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే పలువురు నిర్మాతలు మన సందర్భాలలో ఒకరు ఇద్దరు మినహా హీరోలు ఎవరూ అలా చేయరని, అవసరమైతే సినిమా కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకోవడమే కాకుండా రెమ్యూనరేషన్ వదులుకొని కూడా సినిమాలు చేసే హీరోలు ఉంటారు అని తెలిపారు.ఇకపోతే టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని గురించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
నాని తాజా సినిమా దసరా సినిమా కోసం రెమ్యూనరేషన్ ని బాగా తగ్గించుకున్నాడట.ఈ సినిమా కోసం నాని సగానికి సగం తగ్గించేసుకొని ఆ మొత్తాన్ని సినిమా మీద ఖర్చు పెట్టాల్సిందిగా చిత్ర నిర్మాతలకు తెలిపారట.
సినిమా విడుదలైన తరువాత లాభాలు వస్తే అప్పుడు కావాల్సి ఉంటే మిగిలిన డబ్బులను ఇవ్వవలసిందిగా నాని కోరాడట.ఇదే విషయాన్ని దసరా సినిమా నిర్మాత తెలిపినట్టు తెలుస్తోంది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త నిజమైతే తెలుగు సినిమా కొత్త పంతాలో నడుస్తున్నట్లే అని చెప్పవచ్చు.కాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఊహించని విధంగా ప్లాప్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అలాగే దర్శకుడు కొటాల శివ రెమ్యూనరేషన్ ను తీసుకోలేదట.చిరంజీవి కూడా సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్స్ ను బట్టి డబ్బులు తీసుకుందాము అని చెప్పారట.