బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత అష్ట కష్టాలను ఎదుర్కొంది.
ఆమె ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇంతక ముందు పెళ్లి అయ్యి పిల్లలు వున్నారు అని తెలియడంతో గుండెలు పగిలేలా ఏడ్చి భార్య మెడలో ఉన్న అలాంటి వ్యక్తికి తన జీవితం పంచుకోను అని అతడికి విడాకులు ఇచ్చేసింది.
ఆ తరువాత కొంత కాలం పాటు వ్యాపార వేత్త అనిల్ దురానితో ప్రేమలో పడింది.
రాఖీ సావంత్ నే సర్వస్వం అనుకున్న అతడు ఆమెతో పెళ్లికి ముందే ప్రియురాలి కోసం ఖరీదైన కారు, బంగ్లా కొనిపెట్టాడు.అయితే రాఖీకి ఓ షరతు పెట్టాడు.
ఎక్స్‌పోజింగ్ ఉండే బట్టలు వేసుకోవద్దని సూచించాడు.మొదట్లో రాఖీ ఆ మాటలను పెద్దగా లక్ష్య పెట్టలేదు.
కానీ అదిల్ కుటుంబానికి కూడా తన డ్రెస్సింగ్ సెన్స్ నచ్చకపోవడంతో చివరకు ఆమె మనసు మార్చుకుంది.శరీరాన్ని వీలైనంతవరకు కప్పి ఉంచే బట్టలనే ధరిస్తోంది.
ఇక ఇదే విషయం గురించి తాజాగా రాఖీ మాట్లాడుతూ.ఇండస్ట్రీలో ఉండాలంటే స్కిన్ షో చేయడం తప్పనిసరి.

సల్వార్ డ్రెస్‌తో కెరీర్ ఆరంభించినా తర్వాతి సినిమాలో బికినీ వేసుకోక తప్పదు.ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు.స్వయం కృషితోనే ఆఫర్లు తెచ్చుకోవాలి.కానీ అదిల్‌కు నేను ఎక్స్‌పోజింగ్ చేసేలా డ్రెస్సులు వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు.అవార్డుల ఫంక్షన్‌కు నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో అదిలే నిర్ణయిస్తాడు.అతడు ఎంపిక చేసినవాటినే నేను ధరిస్తున్నాను.
అటు ఇండస్ట్రీని, ఇటు అదిల్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ఓ లిమిట్‌లో ఉండాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.