బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్,ఆలియా భట్ లో ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.అయితే పెళ్లి తర్వాత కూడా ఈ జంట కలిసిమెలసి టూర్లు తిరుగుతూ ఎంజాయ్ చేయాల్సిన ఈ జంట సినిమాలు కమిట్ అయినందువల్ల పెళ్లయిన తర్వాత ఆ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయారు.
కొత్త పెళ్లి కొడుకు రణ్ బీర్ కపూర్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం రన్బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర, షంషేరా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు ఈ కొత్త పెళ్లికొడుకు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తన మొదటి భార్య ఆలియాభట్ కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రణ్ బీర్ కపూర్.
తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుపుతూ చాలా కేజీ గా అనిపించింది అని తెలిపారు.రణ్ బీర్ కపూర్ తన ఫ్రెండ్స్ తో కలిసి కృష్ణరాజు బంగ్లాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి రణ్ బీర్ కపూర్ ఇంటి గేటుకు బొట్టు,పూలు,కుంకుమ, పూల దండ వేసి రణ్ బీర్ కపూర్ కు ఆమెకు పెళ్లి అయిపోయింది అని సంతోషించి అక్కడినుంచి వెళ్లిపోయిందట.

ఈ విషయాన్ని రణ్ బీర్ కపూర్ గెట్ వాచ్మెన్ ఇంటికి రాగానే చెప్పాడట.కానీ నా మొదటి భార్యను ఇంకా నేను కలవాల్సి ఉంది అని సరదాగా తెలిపాడు రణ్ బీర్ కపూర్.మరి ఈ విషయం పై ఆలియా బట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.ఇకపోతే ఆలియాభట్ కెరీర్ మొదట్లో తనకు హీరో రణ్ బీర్ కపూర్ అంతే క్రష్ ఉందని,అతడితో లవ్ లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది అని తన మనసులో మాట బయట పెట్టిన విషయం తెలిసిందే.అలియా భట్ అనుకున్న విధంగానే అతని ప్రేమను పొందడమే కాకుండా ఏకంగా అతని లైఫ్ పార్ట్నర్ అయింది.