టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తన తదుపరి సినిమాలో పైన దృష్టి పెట్టాడు.ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమాలో ఆది పురుష్ కూడా ఒకటి.
ఇకపోతే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా రెమ్యూనరేషన్ విషయం ఎప్పుడూ చర్చల్లోకి వస్తూనే ఉంటుంది.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ లో భారీగా మార్పులు వచ్చిన విషయం తెలిసిందే.
సాహో, రాధే శ్యామ్ వంటి వాటికి భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు ప్రభాస్ వంద కోట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ప్రభాస్ నటించబోతున్న సినిమాల్లో ప్రభాస్ రెమ్యూనరేషన్ మరింత పెంచేశాడని తెలుస్తోంది.ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఆదిపురుష్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.ఇది వరకు ఈ సినిమా కోసం ప్రభాస్ వంద కోట్లు అడిగారనే టాక్ వచ్చింది.అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ తన పారితోషికాన్ని పెంచేశాడని తెలుస్తోంది.

120 కోట్లు ఇవ్వాలంటూ ప్రభాస్ అడిగినట్టు సమాచారం.అయితే ఆదిపురుష్ షూటింగ్ మొదలైన సమయంలో ఆదిపురుష్ కోసం ప్రభాస్ 50 రోజులు కేటాయించాడని, ఒక్కో రోజుకు మూడు కోట్ల చొప్పన మొత్తం 150 కోట్లు తీసుకుంటున్నాడే గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు మాత్రం బాలీవుడ్‌లో ప్రభాస్ రెమ్యూనరేషన్ హైలెట్ అవుతోందట.ఆదిపురుష్ కోసం 120 కోట్లు అడిగాడని, అంత మొత్తం ఇచ్చేందుకు టీ సిరిస్, భూషణ్ కుమార్ అంగీకరించినట్టు తెలుస్తోంది.