ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో మాదిరిగా కాకుండా వరుసపెట్టి జిల్లాల పర్యటనలు చేస్తూ ఉన్నారు.ఒకపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరో పక్క శంకుస్థాపనలపై దృష్టి పెట్టడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే రేపు సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో డిసిసిబి మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఆ తర్వాత పులివెందులలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ కానున్నారు.రేపు ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్.రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుండి 9:50 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఉదయం 10:40 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు.10:45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి.11:00 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుంటారు.
ఆ తర్వాత ఉదయం 11: 25 గంటల నుంచి 11:40 వరకు తిరుపాల్ రెడ్డి మనవడి వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 12:10 గంటలకు పులివెందుల హెలిప్యాడ్ కి చేరుకుంటారు.మధ్యాహ్నం 12:20 గంటలకు పులివెందల గెస్ట్ హౌస్ చేరుకొని.l సాయంత్రం నాలుగు గంటల వరకూ నియోజకవర్గం ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు.అనంతరం సాయంత్రం 4:40 గంటలకు కడప విమానాశ్రయం నుండి బయలుదేరి గన్నవరం చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.