పక్కా కమర్షియల్ లో ముగ్గురు హీరోయిన్స్..!

మారుతి డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో రాశి ఖన్నా కాకుండా మరో ముగ్గురు హీరోయిన్స్ నటించారని తెలుస్తుంది.

 Three Heroines In Gopichand Pakka Commercial Movie Details, Chitra Shukla, Gopic-TeluguStop.com

రాశి ఖన్నాతో పాటుగా కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించిందని తెలుస్తుంది.ఆమెతో పాటుగా చిత్ర శుక్లా, అదితి గౌతం అలియాస్ శీయ కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.

రాశి ఖన్నాతో పాటుగా ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా పక్కా కమర్షియల్ సినిమాలో ఎంటర్టైన్ చేయనున్నారు.పక్కా కమర్షియల్ సినిమా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు డైరక్టర్ మారుతి.

గోపీచంద్ మార్క్ మాస్ అంశాలతో మారుతి మార్క్ మూవీగా ఈ సినిమా వస్తుంది.సీటీమార్ సినిమాతో నిరాశపరచిన గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

సినిమా మీద గోపీచంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ రెండు సినిమాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

పక్కా కమర్షియల్ అనుకున్న విధంగా హిట్ అయితే మళ్లీ మారుతి డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారట గోపీచంద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube