మలయాళంపై సామ్ కన్ను.. అక్కడ కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.

 Samantha Signs Her First Mollywood Movie, Mollywood, Shaakuntalam, Samantha, Yas-TeluguStop.com

ఈమె కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వరుస ఫోటో షూట్ మాత్రం ఆపడం లేదు.ఎప్పుడు కాళీ దొరికినా ఫోటో షూట్స్ లో పాల్గొంటూ.

వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

ఈమె ఫోటో షూట్స్ తో ప్రతి నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఒకవైపు బికినీ వేసుకుని ఘాటు అందాలు చూపిస్తూనే మరోవైపు భారతీయ స్త్రీ అంటే ఇలానే ఉండాలి అనే విధంగా కూడా తన దుస్తులను ఎంపిక చేసుకుని అందరిని ఆకట్టు కుంటుంది.ఇక ఈమె ప్రెసెంట్ నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇన్ని సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.

అలాగే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె మలయాళం ఇండస్ట్రీ పై కన్నేసిందని వార్తలు వస్తున్నాయి.ఈమె నటించిన సినిమాలు కొన్ని మలయాళంలో డబ్ అయ్యాయి కానీ ఇప్పటి వరకు డైరెక్ట్ సినిమా అయితే చేయలేదు.

కానీ ఇప్పుడు ఈమె మలయాళం లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Telugu Bollywood, Khushi, Malayalam, Mollywood, Samantha, Seniorshaji, Shaakunta

ఈమె ఒక మలయాళం ప్రాజెక్ట్ పై సైన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.మాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాష్ పింక్ పోలీస్ అనే టైటిల్ తో ఒక సినిమా చేయనున్నాడు.ఇందులో సమంత ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుని ఆమెకు కథ కూడా వినిపించారట.

సామ్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు.ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube