ఏపీపై బీజేపీ ఫోకస్..

ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు.రానున్న ఎన్నికలకు ఇప్పుటినుంచే పక్కాప్లాన్ తో బీజేపీ నేతలు ప్రచారానికి సిధ్దమవుతున్నారు.

 Bjp Focus On Ap , Bjp, Ap, Vijayawada Siddhartha Hotel‌, Modi, Amit Shah, So-TeluguStop.com

ఈ నెపథ్యంలో ఏపీలో ప్రధాని మోడీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు అగ్రనేతలు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.విజయవాడ సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో శక్తి కేంద్రాల ప్రతినిధులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అదే రోజు సాయంత్రం వివిధ రంగాలకు చెందిన మేధావులతో సమావేశమై రాష్ట్రంలో స్థితిగతులపై చర్చిస్తారు.

ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో చిన్న చూపు ఉండేదని.

కానీ ఇప్పడు పరిస్థితులు మారాయని.ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గల్లీ టూ ఢిల్లీ పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో ప్రజలకు కనీసం అవసరమైన మరుగుదొడ్లు నిర్మించాలి అనే సృహ కూడా లేదని అంటున్నారు.ఏపీలో కొన్ని లక్షల ఇల్లు నిర్మించిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని అన్నారు.

ఏపీలో సామాజిక న్యాయం పేరుతో వైసీపీ దగా చేస్తోందని.కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని బీజేపీ నేతలు అంటున్నారు.

అందుకే రానున్నా ఎన్నికల్లో గట్టిగా పోటి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.వైసీపీ, టీడీపీలకు స్థిరమైన సిద్ధాంతం లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Telugu Amit Shah, Bjp Ap, Modi, Somu Veerraju-Political

కాగా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే ఏపీలో బీజేపీ పావులు కదుపుతోంది.ఇందులో భాగంగా బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రంలో వీలైనన్నిసార్లు పర్యటించాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు.త్వరలో మోదీ, అమిత్ షా కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వస్తే జనసేనతో కలిసి వెళ్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే సోము వీర్రాజు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube