చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సుసైడ్ చేసుకున్న 19 ఏళ్ల కుర్రాడు!

ఈమధ్య యువత ఏంటో బాగా కఠినంగా ఆలోచిస్తుంది.నిజానికి యువత వయసే అలాంటిది.

 19-years Old Boy From Tamil Nadu Killed Him Self To Know What Happens After Deat-TeluguStop.com

ఏదైనా పని కష్టంగా ఉన్నా సరే దానిని ఎలా చేయాలి అని పట్టు పడుతుంటారు.అంతేకాకుండా ప్రమాదకరమైన విషయంలో కూడా యువత బాగా పరిశోధనలు చేస్తూ ఉంటారు.

ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే.అది వారి తప్పు కాదు.

ఆ వయసులో వచ్చే ఆలోచనలు అని చెప్పాలి.ఇప్పటికే ఎంతో మంది యువకులు ఎన్నో ప్రమాదకరమైన విషయాలలో బలి అయ్యారు.

కొన్ని కొన్ని సార్లు కొందరు మతి ఉండి ఆలోచిస్తారో లేక తమ తెలివి తక్కువ తనంతో ఆలోచిస్తారో తెలియదు కానీ వారికి వింత వింత ఆలోచనలు, వింత వింత కోరికలు పుడుతుంటాయి.నిజానికి వాళ్లకు వచ్చే వింత కోరికలను చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.

ఎందుకంటే వారి ఆలోచనలు అలా ఉంటాయి కాబట్టి.ఎక్కువగా ప్రాణాల మీదకి తీసుకొచ్చే ఆలోచనలే వాళ్ళల్లో కదులుతూ ఉంటాయి.

వద్దన్న పనులే చేస్తా అంటూ మారం చేస్తూ ఉంటారు.దీనివల్ల తమ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతుంటారు.

కొన్నిసార్లు వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఆ తల్లిదండ్రులు అస్సలు తట్టుకోలేరు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక యువకుడు చేసిన తెలివి తక్కువ పని వల్ల అతని తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

చనిపోయాక ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ యువకుడు.తమిళనాడు తిరునల్వేలి జిల్లా కు చెందిన సల్మాన్ అనే యువకుడు.

ఇతని వయస్సు 19 సంవత్సరాలు.అతడు లా సెకండియర్ చదువుతున్నాడు.

అతడు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు.ఇక ఇతడికి ఏం జరిగిందో తెలియదు కానీ.

అతడికి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు.అంతేకాకుండా సూసైడ్ నోట్ కూడా రాశాడు.

అందులో.చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇలా చేస్తున్నాను.నేను దాచిన రూ.5000 అమ్మకి ఇవ్వండని రాశాడు.

ఇక పోలీసులు అతని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా ఈ విషయం గురించి కేసు నమోదు చేశారు.ఇక ఈ ఘటన గురించి అందరికీ తెలియటంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.అసలు అతడికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని.ఇంతకీ అతను మతిస్థిమితం లోనే ఉన్నాడా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు అతడు లా చదువుతున్న కూడా అతడు ఎందుకు అంత అమాయకంగా ఆలోచించాడు అని అంటున్నారు.ఏది ఏమి జరిగినా ఆ విషయం గురించి అతను మరణించడం మాత్రం చాలా తెలివి తక్కువ పని అని అనిపిస్తుంది.

కొన్ని చోట్ల మూఢనమ్మకాలు పేరుతో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి.ఈ సమాజంలో కూడా ఇటువంటి నమ్ముతున్న యువత ఆలోచనలు తప్పుడు దారిలో పోతున్నాయి అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube