నేను చాలా లక్కీ.. అందరూ చాలా మంచివాళ్ళు అంటున్న సాయిపల్లవి!

వేణు ఊడుగుల దర్శకత్వంలో హీరో రానా, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాట పర్వం.ఈ సినిమాను డి.

 Rana Daggubati Sai Pallavi Starrer Virata Parvam Trailer Release June 5 Rana Dag-TeluguStop.com

సురేష్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన విషయం తెలిసిందే.అలాగే ఇందులో హీరోయిన్ ప్రియమణి, నవీన్‌ చంద్ర కు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.అంతేకాకుండా పలు సార్లు సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

మామూలుగా ఏదైనా సినిమా రూపొందుతోంది, విడుదల అవుతుంది అంటే ఆ సినిమా నుంచి చిన్న చిన్న అప్డేట్లను విడుదల చేస్తూ ఉంటారు.

కానీ ఈ విరాటపర్వం సినిమా నుంచి టీజర్ విడుదల అయి ఈ ఏడాది అవుతున్నా కూడా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ ను విడుదల చేయలేదు.

ఈ సినిమాకంటే ముందు, ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని అప్డేట్స్ ఇచ్చుకుంటూ పోయినప్పటికీ ఈ సినిమా నుంచి మాత్రం అప్డేట్స్ రావడం లేదు.ఇక ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం రానా అభిమానులు మరోవైపు సాయి పల్లవి అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

కానీ ఎట్టకేలకు ఈ సినిమా ఈ విషయంలో ఇప్పుడిప్పుడే కదలిక మొదలైంది.ఇటీవలే ఈ సినిమాను జూన్ 17న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు.కానీ కాస్త డిఫరెంట్ గా వీడియోని వదిలారు.ఆ వీడియో పై స్పందించిన ఒక అభిమాని ఇందులో ప్రమోషన్స్ ఏవి? సాయి పల్లవి ని చూడటానికి వెయిటింగ్ అని రానాను నిలదీశాడు.సదరు అభిమాని అడిగిన ప్రశ్న పై స్పందించిన రానా.నేను కూడా సాయిపల్లవి అభిమానినే.సాయిపల్లవి కోసమే ఈ సినిమాను తీశాం.ఆమె ఫ్యాన్స్‌ కోసం కర్నూలులో జూన్‌ 5న ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు రానా.ఆ వీడియోపై స్పందించిన సాయిపల్లవి ఇక్కడ అంత సీన్‌ లేదండి.

ప్రజల ప్రేమను పొందుతున్న నేనే చాలా అదృష్టవంతురాలిని.కర్నూలులో వారందరినీ చూసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా అని ట్విటర్‌లో రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube