తెలంగాణ సీఎం కేసీఆర్ను అర్థచేసుకోవడం కష్టమని కొందరు అంటారు.కానీ ఇటీవల ఆయన వేస్తున్న అడుగులు తప్పటగులు అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇందుకు కారణంగా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వెళ్లే తీరే.దేశ రాజకీయాలవైపు ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు.
దేశంలో మార్పు రావాలని బీజేపీ యేతర పార్టీల మద్దతు కూడగడుతున్నారు.ఇప్పటీకే దేశం మొత్తం తిరుగుతూ పావులు కదుపు తున్నారు.
ఎలాగైనా సరే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు.
కేంద్రప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
అయితే సీఎం కేసీఆర్ చర్యలు మాత్రం రాష్ట్రంలో విమర్శల పాలవుతున్నాయి.
ఇప్పటికే రెండు సార్లు అధికారంలో సాధించిన సీఎం కేసీఆర్ మూడోసారి విజయం సాధించడం కష్టతరమని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట.అలాంటప్పుడు కేసీఆర్ వేసే అడుగులు మళ్లీ అధికారం చేపట్టే విధంగా ఉండాలని కాని పార్టీకి నష్టం కలిగించేవి కాకూదని అంటున్నారు.కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉండాలి కానీ.కయ్యానికి దిగకూడదని సూచిస్తున్నారు.కానీ ఇవేమీ పట్టని సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరగుతూ విస్మయానికి గురిచేస్తున్నారు.
2014 ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ 2019కు ముందే ఎన్నికలకు వెళ్లారు.
మరోసారి గెలిచారు.సీఎంగా ప్రస్తుతం పాలన సాగిస్తున్నారు.
ఈ సారి మాత్రం వచ్చే ఏడాదిలోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయి.దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజా సమస్యలను ఏకరువు పెడుతూ టీఆర్ఎస్పై ముప్పేట దాడి చేస్తున్నాయి.
గత ఎన్నికల్లో తెలంగాణ మొత్తంలో ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ.ప్రస్తుతం రాష్ట్రంలో బలపడటం కూడా టీఆర్ఎస్కు మింగుడు పడని విషయం.
గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కార్డు వాడి అధికారాన్ని చేపట్టారు.ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేక.కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్పై బహరింగంగానే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.ఏపీలో 2019కు ముందు అప్పటి ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు ఇలానే తప్పులు చేశారని.
ఇప్పుడు కేసీఆర్ కూడా చేస్తున్నాడని తెలంగాణ ప్రజలు, నాయకులు బహిరంగానే చెబుతున్నారు.దేశ రాజకీయాలంటూ వెళ్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోతే, మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే.టీఆర్ఎస్ పరిస్థితేంటని గులాబీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.మరోవైపు గులాబీ బాస్ చేయించిన సర్వేల్లో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని.వాటి వల్లే కేసీఆర్ తీరులో మార్పు వచ్చిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఈ నేపథ్యంలో దేశంలోని బీజేపీయేతర నాయకుల మద్దతు కూడగట్టి.
ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతారేమో చూడాలి.