సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి ఎక్కువగాఫాలో అవుతుంటారు హీరోలు.ఒకసారి ఏదైనా తేదీ రోజున సినిమా మంచి విజయం సాధించిందంటే.
తర్వాత కూడా మరో సినిమాను అదే తేదీన విడుదల చేయాలని అనుకుంటారు.ఇక అప్పుడు కూడా విజయం సాధించారంటే.
ఆ తేదీ సినిమా హీరోలకు ఒక సెంటిమెంట్ గా మారిపోతూ ఉంటుంది.కేవలం హీరోలకు మాత్రమే కాదు దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి సెంటిమెంట్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పాలి.
అయితే అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన వారిలో హీరో సుమన్ కూడా ఉన్నాడు.80, 90 దశకంలో సుమన్ కథానాయకుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి.ఇక ఇందులో 20వ శతాబ్దం,పెద్దింటి అల్లుడు, నాయుడుగారి కుటుంబం లాంటి సినిమాలు సుమన్ కి మంచి పేరు తీసుకొచ్చాయి.అయితే ఈ మూడు సినిమాలకు కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అన్న విషయం కాస్త ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అదేంటి అంటే ఈ సినిమా విడుదలైన తేదీ.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో సుమన్ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 20వ శతాబ్దం. 1990 మే 30వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎంతో సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి.ఈ సినిమాలోని అమ్మను మించిన దైవమున్నదా అనే పాట కూడా బాగా హిట్ అయింది.
అయితే సరిగ్గా ఏడాది తర్వాత 1991 మే 30 వ తేదీన సుమన్ నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అదే పెద్దింటి అల్లుడు.ఇక హీరోయిన్ నగ్మా కు ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం.ఈ సినిమాకీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.
ఇక ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 1996 మే 30 తేదీన నాయుడు గారి కుటుంబం అనే సినిమా విడుదలైంది.ఇందులో సుమన్ హీరోగా నటించగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక కీలకమైన పాత్రలో నటించారు.సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అనే చెప్పాలి.ఇలా హీరో సుమన్ కెరీర్ను నిలబెట్టి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు మే 30వ తేదీన విడుదల కావడంతో ఇక అప్పటినుంచి సుమన్ ఆ తేదీని సెంటిమెంట్గా మార్చుకున్నారు అట.