పుట్టిన రోజులను చాలామంది ప్రత్యేకంగా జరుపుకుంటారు.ఇక చిన్న పిల్లలు అయితే అదో పండుగలా అనుకుంటారు.
పిల్లలకు బర్త్ డే సందర్భంగా తెలిసినవాళ్ళు, ఇంట్లో తల్లిదండ్రులు గిఫ్ట్ లు ఇవ్వడం సహజమే.మహా అయితే, సైకిల్, వీడియో గేమ్స్ ని గిఫ్ట్ గా ఇవ్వడం చూస్తుంటాం.
కానీ ముహమ్మద్ అవల్ ముస్తఫా, అకా మోంఫా జూనియర్, తన పుట్టినరోజునాడు అత్యంత ఖరీదైన బహుమతిని పొందాడు.రూ.2.82 కోట్ల విలువ చేసే లంబోర్ఘిని అవెంటడోర్ కారును బహుమతిగా అందుకున్నాడు.అయితే ఇదే అతని మొదలు కారు అనుకుంటే తప్పు.ఇది అతని దగ్గరున్న కార్లలో అదనంగా వచ్చి చేరింది అంతే.
ఇదే అసలు ఆశ్చర్యకరమైన విషయం.నైజీరియన్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయిన ఇస్మాలియా ముస్తఫాకు తన తండ్రి నుండి ఈ ఖరీదైన ఫోర్ వీలర్ బహుమతి లభించింది.
అతని తండ్రి మోంఫా సీనియర్, లాగోస్ ద్వీపంలోని మోంఫా బ్యూరియా డి చేంజ్ కంపెనీ CEO కావడం వల్ల తన ముద్దుల కొడుక్కి ఇలాంటి అత్యంత ఖరీదైన బహుమతుల్ని చిన్ననాటి నుండే ఇస్తున్నాడు.తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లాంబోర్ఘిని అవెంటడోర్‌తో కొడుకు దిగిన ఫోటోను అప్‌డేట్ చేశాడు.“మా ఆనందానికి నీ చిరునవ్వు కూడా కారణం.మేము నిన్ను ప్రేమిస్తున్నాము!!!” అంటూ పుత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇస్మాలియా ముస్తఫా.చిన్న వయసు నుండే తన కొడుకు మోంఫాకు చాలా లగ్జరీ జీవితాన్ని అందజేశాడు.ఆరేళ్ల వయసు నుండే మోంఫా ప్రైవేట్ జెట్‌లో తిరగడం మొదలుపెట్టాడు.మోంఫా జూనియర్ కేవలం బ్రాండెడ్ బట్టలు, గడియారాలు, బూట్లు ధరిస్తాడు.
అంతే కాకుండా తన పేరుపై పెద్ద మ్యాన్షనే ఉంది.కొంతమంది తమ జీవితమంతా కష్టపడినా అలాంటి మ్యాన్షన్‌ను కట్టలేరు.
కానీ మోంఫా జూనియర్ ఆరేళ్ల వయసులోనే దీనికి అధిపతి అయ్యాడు.మోంఫా జూనియర్‌కు, తన తండ్రికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది.9 ఏళ్ల వయసులోనే మోంఫా గడుపుతున్న విలాసవంతమైన జీవితం వల్ల తాను ప్రపంచంలోనే మోస్ట్ లగ్జరీ కిడ్‌గా పేరు సంపాదించుకున్నాడు.