బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజిఎఫ్ 2 సినిమా ఇటీవలే విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది రవీనాటాండన్.
ఈ కేజీఎఫ్ 2 సినిమా లో ఆమె కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.కేజిఎఫ్ 2 సినిమాలో హీరో యష్ పాత్ర తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకుంది ఈమె పాత్రనే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పాన్ ఇండియా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.కేజీఎఫ్ 2 సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి అంటే సౌత్ ఇండస్ట్రీ డబ్బులు సంపాదించడం మీదే దృష్టి పెట్టిందనే కదా అర్థం.
సినిమా మీద వారికెంత ప్రేమవుంది అనేది అక్కడ బాగా స్పష్టమవుతోంది.పైగా ఆ కలెక్షన్ల వల్ల థియేటర్ యజమానులకు లాభం కూడా చేకూరుతోంది అని చెప్పుకొచ్చింది రవీనా టాండన్.
ఈ సందర్భంగా గతంలో ఆమె ఒక గర్భవతిగా ఉన్న సమయంలో లావెక్కడం పై వచ్చిన విమర్శలు గురించి స్పందించింది.

నేను గర్భంతో ఉన్నప్పుడు చాలా లావు అయ్యాను.బాబుకు జన్మనివ్వగానే తిరిగి వర్కౌట్స్ మొదలు పెట్టాను అని తెలిపింది రవీనాటాండన్.అయితే అప్పటికే లావు అయ్యాను అంటూ నన్ను అదే విధంగా నటి ఐశ్వర్యరాయ్ ను ట్రోలింగ్స్ చేయడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే ఒకసారి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నాకు ఇంకా బాగా గుర్తు ఉంది.మీరు బరువు పెరిగారు, కాబట్టే పెద్దగా కష్టపడకుండా రియాలిటీ షోలు చేస్తున్నారా? అని అడగగా.అప్పుడు రవీనా బ్రదర్, నేను నా బరువు తగ్గించుకోగలను, కాని నీ ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటావు? అని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాను అని చెప్పుకొచ్చింది.