భాగ్యనగరంలో కోట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన సినిమాలు ఇవే..!

మన టాలీవుడ్ మార్కెట్ కు హైదరాబాద్ కీలకం అని అందరికి తెలిసిన విషయమే.ఎందుకంటే ఇక్కడ ఆ రేంజ్ లో బిజినెస్ జరగడమే కాకుండా కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి.

 Top 5 Movies In Hyderabad Advance Booking Rrr Radheshyam Svp Kgf2 Details, Top 5-TeluguStop.com

టాలీవుడ్ సినిమా మార్కెట్ లో 35 శాతం నైజాం కాగా ఇందులో ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది మాత్రం హైదరాబాద్ లోనే.ఇక్కడ మాములు సినిమాలకు కూడా హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ మాములుగా రావు.

అలాటిది స్టార్ హీరోల సినిమాలకు అయితే అడ్వాన్స్ బుకింగ్స్ నే కోట్లలో జరుగుతాయి.మరి ఇప్పటి వరకు భాగ్యనగరంలో హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకున్న టాప్ 5 సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఆర్ఆర్ఆర్ :

రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించారు.దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.

ఈ సినిమా మార్చి 25న రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది.ఈ సినిమాకు హైదరాబాద్ లో భారీ అడ్వాన్స్ బుకింగ్ జరిగింది.ఏకంగా 10.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లు జరిగాయి.దీంతో టాప్ ప్లేస్ లో ఈ సినిమా నిలిచింది.

Telugu Advance, Bheemla Nayak, Hyderabad, Kgf Chapter, Pawan Kalyan, Prabhas, Ra

సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా హైదరాబాద్ లో ఏకంగా 6.60 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుని టాప్ 2 లో నిలిచింది.

కేజిఎఫ్ 2 :

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ 2 కూడా హైదరాబాద్ లో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుపు కున్నాయి.ఈ సినిమాకు 6.56 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగి టాప్ 3 లో ఉంది.

Telugu Advance, Bheemla Nayak, Hyderabad, Kgf Chapter, Pawan Kalyan, Prabhas, Ra

భీమ్లా నాయక్ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్వకత్వంలో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు 6.30 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.దీంతో ఈ లిస్టులో టాప్ 4 ప్లేస్ లో ఉంది.

రాధేశ్యామ్ :

బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఈయన నటించిన రాధేశ్యామ్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు 6.28 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.దీంతో ఈ లిస్టులో టాప్ 5 లో నిలిచింది.

ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ సినిమాలన్నీ ఈ ఎట్టి రిలీజ్ అయినవే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube