ఆ యువకుడికి పిచ్చి పీక్స్.. యంగ్‌గా కనిపించేందుకు మూత్రం తాగుతున్నాడు!

నలుగురినీ ఆకర్షించాలనే తాపత్రయమో, ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే ఆత్రమో తెలియదు కానీ ఇటీవల కాలంలో కొందరి తీరు విభిన్నంగా ఉంటోంది.కొందరు స్టైల్ పేరుతో చిరిగిన బట్టలు వేసుకుంటుంటే, చిత్రవిచిత్ర హెయిర్ స్టైల్‌తో మరికొందరు బయటకు వస్తున్నారు.

 Young Man Drinking Urine To Look Young Urine, Men, England, Drinkinfg, Viral Lat-TeluguStop.com

ఇదంతా ఫ్యాషన్ అని కొందరు సమర్థించుకుంటున్నారు.ఇలా ఎన్నున్నా ఓ వ్యక్తి మాత్రం యంగ్‌గా కనిపించేందుకు చేస్తున్న పని మాత్రం జుగుప్స కలిగించేదిగా ఉంది.

తన మూత్రం తానే తాగుతూ, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఓ యువకుడు పెట్టాడు.

జిహ్వకో రుచి.

పుర్రెకో బుద్ధి అని పెద్దలు అంటుంటారు.ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి ఉంటుంది.

ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకునే కొందరు వెరైటీగా ఉంటుంటారు.తాజాగా ఇంగ్లాండ్‌లోని​ హ్యాంప్​షైర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇదే తరహాలో ప్రవర్తిస్తున్నాడు.34 ఏళ్ల వయసున్న హ్యారీ మాటాదీన్ రోజూ తన మూత్రాన్ని చాలా ఇష్టంగా తాగుతున్నాడు.దీనికి అతడు చెబుతున్న కారణాలు అందరినీ నివ్వెరబోయేలా చేస్తున్నాయి.

తాను పూర్తిగా శాఖాహారినని, తాను అందంగా, యవ్వనంతో కనిపించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించాడు.అందులో భాగంగా తాను మూత్రాన్ని తాగుతున్నట్లు చెప్పాడు.

అది కూడా కొన్ని రోజుల పాటు నిల్వ చేసి తాగుతున్నట్లు చెప్పాడు.మూత్రాన్ని తాగడమే కాకుండా దానిని ముఖానికి పూసుకుంటున్నాడు ఈ యువకుడు.

వినడానికి అందరికీ ఈ విషయం ఏదోలా ఉంటుంది.అయితే అతడు మాత్రం చాలా ఇష్టంగా ఈ పని చేస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు అతడితే మాట్లాడడమే మానేశారు.ఈ అంశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

నెటిజన్లంతా ఇతడి తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.యంగ్‌గా కనిపించేందుకు ఇలా పిచ్చిపట్టినట్లు ప్రవర్తించాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube