తెలుగు ప్రవాసులకు కొండంత అండగా “GWAC”

భారత్ నుంచీ ఎంతో మంది ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఎన్నో దేశాలకు వలసలు వెళ్తుంటారు.వారికి ఉన్న జ్ఞాన సంపదతో అక్కడే స్థిరపడేలా ఆర్ధికంగా నిలదొక్కుకునేలా కష్టపడుతారు వారికి ఎవరి సహాయ సహకారాలు పెద్దగా అవసరం ఉండక పోవచ్చు .

 తెలుగు ప్రవాసులకు కొండంత అండ�-TeluguStop.com

అయితే పొట్ట చేత బట్టుకుని అధిక సంపాదన కోసం, తమ కుటుంబాలకు ఆర్ధిక భోరసా ఇచ్చేందుకుగాను ఎంతో మంది కార్మికులుగా అరబ్బు దేశాలకు కార్మికులుగా పనిచేసేందుకు వెళ్తుంటారు.అలా వెళ్ళిన వారు ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటారు.ముఖ్యంగా

అరబ్బు దేశాలకు భారత్ లోని తెలుగు రాష్ట్రాల నుంచీ ఎంతో మంది కార్మికులుగా వలసలు వెళ్ళగా వారిలో అత్యధిక శాతం మంది కనీసం అక్కడి బాష, వారి నియమ నిభందనలు తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.కనీసం చిన్న పలకరింపుకు కూడా నోచుకోకుండా, ఆపద వస్తే ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమంటూ గడిపే వారు ఎంతో మంది ఉంటారు.

ఒక వేళ ఇంటికి వెళ్లి పోవాలన్నా సరే ఏం చేయాలో ఎలా వెళ్ళాలో తెలియని వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్య మేస్తుంది.అయితే ప్రాంతాల వారిగా అక్కడి భారతీయులకు ఎన్నో సంఘాలు అండగా ఉంటాయి.

వారికి ఎలాంటి ఆపద వచ్చినా సరే మేమున్నామంటూ భోరసాని ఇస్తూ వారికి తోడుగా ఉంటాయి.కానీ

ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా తమ పని తాము చేసుకుంటూ, కేవలం సేవపైనే దృష్టి పెట్టి ముందుకు వెళ్ళే సంఘాలు మాత్రం వేళ్ళపై మాత్రమే లెక్కించగలం అలాంటిదే “GWAC” (గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ సెంటర్ ).

తెలంగాణా నుంచీ అరబ్బు దేశాలైన సౌదీ, యూఏఈ, కువైట్, ఖతర్, ఒమన్ వంటి దేశాలకు వలసలు వెళ్ళిన ప్రవాసులు అక్కడ పడుతున్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వెంటనే వారికి అక్కడ అందుబాటులో ఉన్న తమ సంస్థ సభ్యుల ద్వారా తక్షణ సాయం అందిస్తారు.అంతేకాదు చనిపోయిన ఎన్నారైలకు వారి వారి ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తారు.

వారి ప్రాంతాలకు చేరుకున్న తరువాత వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి వారికి ఆర్ధిక సాయం కూడా అందిస్తారు GWAC సభ్యులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube