ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు తమన్.అతను పాట వినిపించినా అది శ్రోతలను మాత్రం విశేషంగా ఆకట్టుకుంటుంది.
అలా వైకుంఠపురం సినిమా తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన థమన్ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు.తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు ఇక పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ భావిస్తున్నారు.
అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఇప్పుడు స్టార్ హీరోలందరూ కూడా తమ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.
ఇలా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో నాచురల్ స్టార్ నాని తమన్ మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది అన్న విషయం తెలిసిందే.నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనుకున్నంత మంచి ఫలితాన్ని మాత్రం అందించలేకపోయింది.
సినిమా స్టోరీ పరంగా బాగున్నప్పటికీ ఎక్కడో తేడా కొట్టేసింది.దీంతో ఇక ఈ సినిమా విషయంలో నానీ కూడా నిరాశ లో మునిగిపోయాడు.
ఈ సినిమాకు సరిగ్గా మ్యూజిక్ అందించకపోవడం సినిమా హిట్ కాకపోవడానికి కారణం అని నాని ఫీల్ అయ్యాడట.

ఇక ఇలా ఫీల్ అయిన విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఆ తర్వాత నాని హీరోగా నటించిన శ్యాం సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ ను ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్గా షాకింగ్ కామెంట్స్ చేశాడు నాచురల్ స్టార్ నాని ఇక ఇదే విషయంపై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నాని కి కౌంటర్ కూడా ఇచ్చాడు.అయితే ఇద్దరు పేర్లను ప్రస్తావించకపోయినప్పటికీ జరిగిన గొడవ మాత్రం అందరికీ అర్థమైపోయింది.తమన్ మ్యూజిక్ నచ్చకపోవడం వల్లే నాని నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్ సినిమాకు తమన్ ను కాకుండా గోపీసుందర్ కు ఒక అవకాశం ఇచ్చాడు అంటూ టాక్ కూడా ఉంది అని చెప్పాలి.