ప్రముఖ పేమెంట్ కార్డుల జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డు అదిరిపోయే క్రెడిట్ కార్డులను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తుంది.తాజాగా ఇది ఆకర్షణీయమైన ఫీచర్లతో మరో కార్డు లాంచ్ చేసింది.
గ్రాసరీ స్టోర్ అయిన నేచర్స్ బాస్కెట్ తో పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకున్న ఎస్‌బీఐ కార్డు… నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డు, నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డు ఎలైట్ అనే రెండు కార్డులను లాంచ్ చేసింది.ఈ కార్డులతో వినియోగదారులు ట్రావెల్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్, లైఫ్‌స్టైల్ వంటి వాటిపై ఖర్చులు చేసి చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు.నేచర్స్ బాస్కెట్ స్టోర్లలో ఖర్చు చేసే ఎవ్రీ రూ.100 పై మీరు 20 వరకు రివార్డ్ పాయింట్స్ పొందొచ్చు.రెస్టారెంట్, సినిమా థియేటర్లు, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ పై చేసే ప్రతి రూ.100కి కూడా మీరు 10 వరకు రివార్డ్ పాయింట్లు సొంతం చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డు ఎలైట్ ద్వారా మీరు ప్రతి ఏడాది రూ.6 వేల వరకూ విలువైన బుక్ మై షో మూవీ టిక్కెట్లు ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు.దీనర్థం నెలకి రూ.250 విలువైన 2 టికెట్లను మీరు ఉచితంగా పొందొచ్చు.ఈ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఒక సంవత్సరంలో ఆరు లక్షలకు పైగా ఖర్చు చేసినట్లైతే పదివేల విలువైన గిఫ్ట్ వోచర్లను ఫ్రీగా దక్కించుకోవచ్చు.
ఇదిలా ఉండగా నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డు ఉపయోగించి మీరు రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేస్తే ప్రీమియం బ్రాండ్ల నుంచి రూ.3 వేల విలువైన ఫ్రీ వోచర్లను పొందవచ్చు.ఇక వార్షిక మెంబర్షిప్ ఫీజుల విషయానికి వస్తే.నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డు ఫీజు రూ.1499గా ఉండగా.నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డు ఎలైట్ ఫీజు రూ.4,999గా నిర్ణయించారు.