సూర్యాపేట జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చిన్న జీయర్ పై ప్రజలు,ప్రజా సంఘాల నేతలు భగ్గుమంటున్నారు.జిల్లాలో ప్రతీ రోజు ఏదో ఒక చోట చిన్న జీయర్ పై కేసులు నమోదవుతూనే ఉన్నయు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో గాజులమల్కపురం సమ్మక్క-సారక్క ఆలయ కమిటీ ఛైర్మన్ నాతాల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రకు ప్రతీకలైన గిరిజనుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క-సారక్కలను గురించి చులకనగా మాట్లాడిన చినజీయర్ స్వామి బేషరతుగా తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
చిన్న జీయర్ క్షమాపణలు చెప్పనియెడల తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు.