2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన రెండేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.
అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.
నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.
2020 చివరి నాటికి ఏవో కొన్ని దేశాలు తప్పించి.అంతగా వైరస్ ఉద్ధృతి లేకపోవడం అదే సమయంలో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో ఇక కోవిడ్ ముప్పు తప్పినట్లేనని అంతా భావించారు.
కానీ ఉత్పరివర్తనం చెంది .ఎన్నో రెట్లు శక్తిని పుంజుకుని మానవాళిపై దాడి చేయడం ప్రారంభించింది ఈ మహమ్మారి.వైరస్ విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై దాదాపు అన్ని దేశాలు ఆంక్షలు విధించాయి.అయితే ప్రస్తుతం అన్ని దేశాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో ఒక్కొక్క దేశం నిబంధనలను సడలిస్తూ వస్తున్నాయి.
తాజాగా కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దీనిలో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణీకులు దేశంలోకి వచ్చేందుకు కోవిడ్ నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్‌ను చూపించాల్సిన అవసరం లేదని ట్రూడో సర్కార్ గురువారం తెలిపింది.ఈ నిర్ణయం కారణంగా కెనడా సరిహద్దుకు ఇరువైపులా వ్యాపార, పర్యాటక రంగానికి ఉపశమనం లభించినట్లయ్యింది.ఏప్రిల్ 1 నుంచి కెనడాకు వచ్చే వారికి కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ అక్కర్లేదని ఆ దేశ ఆరోగ్య మంత్రి జీన్ వైవ్స్ డుక్లోస్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కెనడాకు వచ్చేవారు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణీకులకు కూడా తప్పనిసరిగా యాంటిజెన్ టెస్ట్‌లో నెగిటివ్ రావాలి.తాజాగా కెనడా ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో వ్యాపార వర్గాలు, ప్రజలకు ఉపశమనం కలిగినట్లయ్యింది.
కాగా.కోవిడ్ పాజిటివిటీ రేటు క్షీణిస్తుండటం, ఆసుపత్రిలో చేరికలు తగ్గుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల కెనడాలోని అంటారియో ప్రావిన్స్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మార్చి 21 నుంచి అక్కడ మాస్క్ తప్పనిసరి నిబంధనను ఎత్తివేయనుంది.నాటి నుంచి మాస్క్ ధరించాలన్న నిబంధన
.