తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తాజాగా వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ పార్టీ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.2019 ఎన్నికల సమయంలోనే దేశం బాగుపడాలంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి ప్రజలను రక్షించాలని కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. కానీ ఆ సమయంలో కేసీఆర్ ప్రయత్నాలు పెద్దగా ముందుకు వెళ్లలేదు.
అదంతా పక్కన పెడితే ఇటీవల కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తూ తెలంగాణ పట్ల బీజేపీ వివక్షత చూపుతోందని ఆరోపించారు.ఇటువంటి బీజేపీ నాయకుల నుండి దేశాన్ని కాపాడాలి అంటూ మంచి భవిష్యత్తు కావాలంటే దేశ యువత మేల్కొనాలి అని పిలుపునిచ్చారు.
ఇక ఇదే సమయంలో ఎన్నికల సమయంలో మోడీ వ్యవహరించే తీరుపై కూడా కేసీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేయడం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకున్నారు.
ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోరుకున్న మొక్కులను అమ్మవారు తీర్చారని స్పష్టం చేశారు.అయితే తాజాగా ఇప్పుడు దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకున్నట్లు తెలిపారు.ఖచ్చితంగా తన కోరికను అమ్మవారు నెరవేరుస్తారని.
ఆ నమ్మకం ఉందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.