కిమ్.కొన్ని రోజులుగా ఈ పేరు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపిస్తోంది.ఇక ఆయన స్టైలే వేరు.దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.కానీ కొత్త క్షిపణి పరీక్ష చేసి అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు సవాల్ విసురుతూ ముందుకు సాగుతున్నారు.కొన్ని సందర్భాల్లో ఆయన స్టైలే వేరు.
అందరూ ఒకలా ఆలోచిస్తే.ఆయన మరోలా ఆలోచించి తాను ఎప్పుడు ప్రత్యేకంగా నిలుస్తుంటారు.
ఏ విషయంలోనూ ఆయన మొహమాటపడరు.ఇలాంటి విషయాలు చాలా సార్లే రుజువయ్యాయి.
ఇక ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆయన తన పర్సనల్ కారులో టాయిలెట్ తయారు చేయిస్తున్నారట.
నిజానికి ఆయన ఎవరినీ నమ్మరు తన నీడకు కూడా.అందుకే ఆయన ఎక్కడికి వెళ్లిన పర్సనల్ టాయిలెట్ వెంటే ఉండాలని భావిస్తున్నారు.
ఈ టాయిలెట్ ఆయన శత్రువులకు చిక్కితే తన ప్రాణాలకే ప్రమాదమని భావిస్తారు.ఆ టాయిలెట్ ద్వారా చాలా విషయాలు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని భయపడుతూ ఉంటారు.
ఇక ఆయన సెక్యూరిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయనకు చాలా మంది బాడీ గార్డ్స్ ఉంటారనే విషయం తెలిసిందే.ఇక వారు కిమ్ పైనే కాదు.ఆయన యూజ్ చేసే టాయిలెట్స్ పైన స్పెషల్ నిఘా పెడుతున్నారు.
ఆయన టాయిలెట్ ను ఎవరైనా యూజ్ చేసినట్టు తెలిస్తే ఇక సదురు వ్యక్తికి మరణశిక్షే విధిస్తారు.
ఆయన యూజ్ చేసిన టాయిలెట్ను బట్టి.ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే చాన్స్ ఉందని కిమ్ భావిస్తారట.అందుకు ఆయన టాయిలెట్ పైన కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారట.
ఇక ప్రస్తుతం ఆయన వినియోగించే టాయిలెట్ కు సెక్యూరిటీ సిబ్బంది కాపలా ఉంటారట.ఇక కిమ్ ఎక్కడికి వెళ్లిన ఆయన వెంట ఈ టాయిలెట్ కారు ఉండాల్సిందే.