అన్న కళ్యాణ్ రామ్ కోసం 40 కోట్ల రూపాయలు త్యాగం చేసిన తారక్.. ఏమైందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ లో వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.ఎన్టీఆర్ నటిస్తే సినిమా హిట్ అనే కాన్ఫిడెన్స్ ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉంది.

 Young Tiger Ntr Remuneration For Next Movie Producer Kalyan Ram Details, Ntr, Ka-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ డబుల్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది.

ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా జై లవకుశ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టరని ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఈ సినిమాకు పెట్టుబడిగా ఉండనుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు 40 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ గా ఫిక్స్ అయిందని బోగట్టా.

ఆర్ఆర్ఆర్ రిలీజై సక్సెస్ సాధిస్తే ఈ రెమ్యునరేషన్ విషయంలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

Telugu Alia Bhatt, Koratala Siva, Kalyan Ram, Koratala Shiva, Ntr Kalyan Ram, Nt

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ విడుదలైన తర్వాత వచ్చేలా లాభాల్లో కొంత మొత్తాన్ని ఎన్టీఆర్ పారితోషికంగా తీసుకోనున్నారు.ఒక విధంగా రెమ్యునరేషన్ ను త్యాగం చేసి తారక్ ఈ సినిమాలో నటిస్తున్నారు.తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా ఈ సినిమాలో ఫిక్సయ్యారు.

Telugu Alia Bhatt, Koratala Siva, Kalyan Ram, Koratala Shiva, Ntr Kalyan Ram, Nt

ఆర్ఆర్ఆర్ లో చరణ్ కు జోడీగా నటించిన అలియా భట్ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో మూవీ ఆఫర్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత తెలుగులో ఆమెకు మరిన్ని ఆఫర్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.అయితే అలియా భట్ రెమ్యునరేషన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్ తో పోలిస్తే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube