బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమెకి సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటుంది.
మలైకా ఎక్కువగా తన ఫిట్ నెస్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక 47 ఏళ్ళ ఈ బ్యూటీ ని ఈమె అభిమానులు మమ్మీ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే పాటతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.ఆ తర్వాత ఆమె 25 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆ దంపతులకు ఒక కొడుకు కూడా జన్మించాడు.ఇదిలా ఉంటే నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో మలైకా అరోరా ఒక విషయం గురించి చెప్పుకొచ్చింది.
ఆమె పెళ్లి తన ప్రొఫెషనల్ లైఫ్ పై మాత్రం ప్రభావం చూపించలేదు అని ఆమె మీడియాకు వెల్లడించింది.పెళ్ళి సమయంలో ఆమె గ్లామరస్ గా ఉండటానికి ప్రయత్నిస్తూనే తనకు ఎదురైన అడ్డంకులన్నీ అధిగమించాను అని ఆమె చెప్పుకొచ్చింది.
పెళ్లయిన తర్వాత గతంలో చాలామంది సెలబ్రిటీలు నటించలేదు.కొద్దిమంది మాత్రమే పెళ్ళి తర్వాత నటించే వారు.కానీ నా పెళ్లి నా కెరీర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు.ఇకపోతే ప్రస్తుత పరిస్థితులు చాలా మారిపోయాయి ఇప్పట్లో పెళ్లి అయినా కూడా నటించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది అని చెప్పుకొచ్చింది.

అలాగే నేను నటనను ఎప్పుడూ గ్లామర్ ఇండస్ట్రీగానే భావిస్తాను అని ఆమె తెలిపింది.అలా గ్లామరస్ గా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఎన్నో అవకాశాలను సొంతం చేసుకున్నాను అంటూ మలైకా అరోరా మీడియాకు వెల్లడించింది.సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని 1998లో మలైకా అరోరా పెళ్లి చేసుకుంది.ఈ దంపతులకు అర్హన్ ఖాన్ అనే కుమారుడు కూడా జన్మించాడు.ఈ దంపతులకు పుట్టిన కుమారుడు ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు.ఇకపోతే మలైకా అరోరా ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.