సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అనేక రకాల వీడియోలు మనకు నెట్టింట్లో దర్శనం ఇస్తున్నాయి.ఈ తరహా వీడియోలను చూసిన తర్వాత నిజంగానే షాగింగ్ లా ఉంటున్నాయి.
ఎందుకంటే ఇలాంటివి మనం అస్సలు ఊహించలేదు.ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోక తప్పదు.
కాగా ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగినా.మనకు పెద్దగా తెలియదు.
ఎందుకంటే అప్పుడు సోషల్ మీడయా ఇంతలా పాపులర్ కాలేదు కదా.కానీ ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే మనకు నెట్టింట్లో కనిపించడం కామన్ అయిపోయింది.
ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.జంతువులు కూడా మనుషులను చూసి అనేక విషయాలు నేర్చుకుంటున్నాయండోయ్.
చాలా విషయాల్లో అచ్చం మనుషులను అనుకరిస్తున్నాయి.డ్యాన్స్ చేయడం, నడక లాంటి విషయాల్లో పెంగ్విన్లు కూడా ఈ మధ్య చాలా డెలవప్ అయిపోయాయి.
మొన్నటికి మొన్న ఓ పెంగ్విన్ ఎంత అందంగా మైకేల్ జాక్సన్ లాగా డ్యాన్స్ చేసిందో చూశాం.అయితే ఇప్పుడు కూడా ఓ పెంగ్విన్ ఇలాగే నడకతోనే ముచ్చట గొలిపేస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా పాపులర్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో ఆ పెంగ్విన్ అచ్చం బొద్దుగా ఉండే చిన్నారులను కాపీ కొట్టినట్టు కనిపిస్తోంది.కొంచెం బొద్దుగా ఉండే చిన్నారులు నడిస్తే చూడటానికి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది.అయితే ఇప్పుడు కూడా పెంగ్విన్ కూడా ఇలాగే నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వాస్తవానికి పెంగ్విన్ లు ఇలా నడవడం మునుపెన్నడూ చూసి ఉండం.కానీ ఇది మాత్రం ఇలా నడవడమే అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియో మీద చాలా రకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి.