కేసీఆర్ వరంగల్ పర్యటన కొరకు వేచి చూసిన బీజేపీ.. ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.

అయితే బీజేపీ ,టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ముందుకు సాగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచి రాజకీయంగా బలపడాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తోంది.

అయితే ప్రస్తుతం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలుపు కొరకు పెద్ద ఎత్తున తెర వెనుక వ్యూహాలు రచిస్తూ ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలనే బలమైన లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి ఉంది.

అయితే నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వరంగల్ జిల్లాలో నేడు పర్యటించనున్న విషయం తెలిసిందే.అయితే ఈ పర్యటన కొరకు బీజేపీ పెద్ద ఎత్తున వేచి చూసిన పరిస్థితి ఉంది.

ఎందుకంటే వర్షాలు కురిసిన తర్వాత బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ మరికొంత మంది కీలక నేతలు వరంగల్ జిల్లాలో పర్యటించి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే.

Advertisement

ఆ తరువాత రోజే కెసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించాలని అనుకోవడంతో ఈటెల దెబ్బకు కేసీఆర్ కదిలివచ్చాడు అనే విషయాన్ని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉండేది.కాని చివరి నిమిషంలో కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో బీజేపీ వ్యూహం బెడిసి కొట్టిందని చెప్పవచ్చు.అయితే కేసీఆర్ మాత్రం నేడు ప్రగతి భవన్ లో పర్యటన రద్దుపై ఇంకా మిగతా ఇతరేతరా విషయాలపై స్పందించే అవకాశం ఉంది.

నేడు వరంగల్ లో కనుక కేసీఆర్ పర్యటించి ఉంటే బీజేపీకి భారీగా రాజకీయ లబ్ధి జరిగి ఉండేదని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు