దారుణం... కరోనా వచ్చిన ఆ నటి చచ్చిపోవాలంటూ కోరుకుంటున్న నెటిజన్స్..?

దేశవ్యాప్తంగా మరొకసారి కరోనా విజృంభిస్తోంది.రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

 Netizens Severely Trolling Actress Swara Bhaskar Infected With Corona Positive D-TeluguStop.com

కరోనా మహమ్మారి మరొకసారి అంతకంతకూ పెరిగి పోతుండటంతో ప్రజలు భయపడుతున్నారు.సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ కరోనా మహమ్మారి దాటికి భయపడుతున్నారు.

ఇప్పటికే ఇది ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎంతో మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.

అయితే ఈ వైరస్ రోజురోజుకీ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.తాజాగా ఆ జాబితాలోకి నటి సర్వ భాస్కర్ కూడా జాయిన్ అయింది.

నటి సర్వ భాస్కర్ కు తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ పోస్ట్ చేసింది.

ఇక కరోనా నిబంధన ప్రకారం ఆమె ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపింది.ఇకపోతే తమ అభిమాన సెలబ్రిటీలు కరోనా బారిన పడితే త్వరగా కోలుకోవాలి అని అభిమానులు పూజలు చేస్తూ, సోషల్ మీడియాలో ట్విట్టర్లలో మెసేజ్ లు చేస్తూ ఉంటారు.

కానీ సర్వ భాస్కర్ పై మాత్రం నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.మోదీ మీద నిందలు వేసి ఈ విషయాన్ని క్లోజ్ చేయండి దీదీ అంటూ ఒకరు కామెంట్ చేయగా.

కరోనా ను చూస్తే బాధగా ఉంది అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు.

Telugu Actress, Actressswara, Bollywood, Corona, Corona Wave, Swarabhaskar, Swar

ఇంకొక నెటిజన్ అయితే రెచ్చిపోయి మరి 2022 లో ఇప్పటి వరకు నేను విన్న అన్ని వార్తలు అత్యుత్తమమైనది ఇదే అంటూ కామెంట్ చేశాడు.ఆమె చనిపోయిన నరకంలో కూడా చోటు పొందకుండా ఉంటుంది అనుకుంటున్నా.అడ్వాన్సు గా నరకం లో విశ్రాంతి తీసుకోండి అంటూ కామెంట్ పెట్టాడు.

మీ మరణవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటూ విపరీతంగా ట్రోలింగ్ చేశారు నెటిజన్స్.దీనికి  సంబంధించిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే కరోనా బారిన పడిన ఆమెను త్వరగా కోలుకోవాలి అని కామెంట్లు చేయాల్సిన నెటిజెన్స్ ఆమె మరణవార్త కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube