సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి.వీటిల్లో ఎక్కువగా రకరకాల ఫుడ్ కు సంబంధించిన వీడియోలు అయితే బాగా పాపులర్ అయ్యాయి.
కొత్త కొత్త వంటలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.తినే ఆహారాల పై రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు.
వింత వింత పేర్లు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.మొన్నటికి మొన్న ఒరియో బిస్కెట్స్ తో బజ్జిలు వేయడం, పాని పూరీ ఐస్ క్రీమ్ అని రకరకాల ప్రయోగాలు చేసారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వెరైటీ ఫుడ్ రెసిపీ హల్చల్ చేస్తుంది.మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి.
చిరు తిండి తినాలని అనిపించే వారికి మ్యాగీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
అలాగే స్ట్రీట్ ఫుడ్ రెసిపీలలో మ్యాగీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
అలాంటి మ్యాగిని ఉపయోగించి ఒక వెరైటీ రెసిపీని తయారు చేసారు.అది కూడా షరబత్ ని ఉపయోగించి తయారు చేస్తున్న ఈ మ్యాగీ వీడియో పై నెటిజన్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తేతాజాగా అర్జున్ చౌహాన్ రూహఫ్జా అనే ఒక ప్రముఖ ఫుడ్ బ్లాగర్ ఓ మ్యాగీ రెసిపీని షేర్ చేశారు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఆ వీడియోలో స్ట్రీట్ ఫుడ్ తయారు చేస్తున్న ఒక వ్యక్తి షరబత్ బాటిల్ ని షేక్ చేసి ముందుగా తయారు చేసి ఉన్న మ్యాగీ ప్లేట్ లో కలుపుతాడు.ఈ షరబత్ మ్యాగీని అనూజ్ అనే వ్యక్తి రుచి చూశాడు.
చూడడానికి మ్యాగీ బాగా ఎర్రగా ఉంది.దానిని తిన్న అనూజ్ పేస్ ఒకరకంగా పెట్టడం కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు.
ఇకపోతే ఈ వీడియోను ఇప్పటిదాకా 3 మిలియన్ల మందికి పైగా చూసారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలా అందరు ఎంతగానో ఇష్టపడే చిరుతిండిని నాశనం చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు.అసలు మ్యాగీలో షరబత్ కాంబినేషన్ ఏంట్రా బాబు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడూ చూడలేదంటున్నారు నెటిజన్లు.