ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి జగన్ ఈ విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు.ఎవరి ఊహకు అందనంత విధంగా తన పరిపాలన ఉండాలని, రాబోయే తరాలు కూడా తన పరిపాలన గురించి గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో జగన్ సంచలన నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నారు.
మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు.ఇప్పటికి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, ఆ విధంగానే వ్యవహారాలు చేస్తున్నారు.
అయితే జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కోర్టుల్లో ఎదురు దెబ్బ తగలడం కారణంగా అమలు కాలేదు .ఇంకా ఎన్నో నిర్ణయాలు పెండింగ్ ఉన్నాయి.జగన్ నిర్ణయాలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తూనే వస్తున్నాయి.
అయినా ఆ నిర్ణయాలు మార్చుకునేందుకు, వెనక్కి తీసుకునేందుకు జగన్ ఇష్టపడేవారు కాదు. అయితే ఇప్పుడు జగన్ తన నిర్ణయాలు ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ నిర్ణయాలపై విపక్షాలు పెద్ద రాద్ధాంతం చేసినా, జగన్ పట్టించుకోకుండా తన నిర్ణయాలను మార్చుకోవడం వెనుక కారణాలు ఏంటనే విషయంపై రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. శాసన మండలి రద్దు, మూడు రాజధానులు, ఇలా ఎన్నో వివాదాస్పద అంశాలతో జగన్ ముందుకు వెళ్లారు. అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో రివర్స్ అవుతున్నాయని , వైసీపీ ప్రభుత్వానికి దక్కాల్సిన క్రెడిట్ దక్కకుండా ప్రజా వ్యతిరేకతకు కారణం అవుతున్నాయని వివిధ సర్వే రిపోర్టులు, ఇంటెలిజెన్స్ నివేదికలు జగన్ ప్రభుత్వానికి డేంజర్ బెల్ అన్నట్లుగా సిగ్నల్ ఇవ్వడంతో, ఆయన వెనక్కి తగ్గినట్టు గా కనిపిస్తున్నారు.
అలాగే వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం నిర్వహించిన సర్వేలో ను చాలా విషయాల్లో వైసీపీ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు జగన్ కు ఈ విషయమై పీకే టీం హెచ్చరికలు కూడా చేసినట్లు సమాచారం.వారి సర్వే రిజల్ట్ తో పాటు నిఘా వర్గాల నివేదికలతో జగన్ నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు గా కనిపిస్తున్నారు.తాజాగా మద్యం ధరలు ఏపీలో తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు ఇవేనట.2019లో వైసీపీని గెలిపించుకునేందుకు కష్టపడిన వారిలో ఎక్కువ మంది ఇప్పుడు మద్యం కొనలేని పరిస్థితిలో ప్రభుత్వాన్ని మద్యం దుకాణాల వద్ద తిట్టిపోస్తున్న తీరు , ఊరూ పేరూ లేని బ్రాండ్లు, గతంలో ఉన్నత నాణ్యత గా మద్యం లేక పోవడం ఇలా చాలా కారణాలు తాగుబోతుల్లోనూ వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయి.జగన్ నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయని, విమర్శలు వ్యక్తమైన ఫర్వాలేదు అని, జనాల్లో తమ ప్రభుత్వం పై చెడ్డ ముద్ర పడకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు వరుసగా తన నిర్ణయాలు వెనక్కి తీసుకునేందుకు జగన్ వెనకాడడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.