తెలంగాణ వ్యాప్తంగా రేపు జాతీయ గీతాలాప‌న‌

తెలంగాణలో భార‌త స్వ‌తంత్ర వ‌జ్రోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.దీనిలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాప‌నకు ఏర్పాట్లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి.రేపు ఉద‌యం 11.30 గంట‌ల‌కు గీతాలాప‌న చేయ‌నున్నారు.ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ అబిడ్స్ లోని జీపీవో కూడ‌లి వ‌ద్ద గీతాలాప‌న‌లో పాల్గొన‌నున్నారు.ఈ మేర‌కు అబిడ్స్ జీపీవో స‌ర్కిల్, నెక్ల‌స్ రోడ్డు కూడ‌లి ప్రాంతాల్లో ఏర్పాట్ల‌ను సీఎస్ సోమేశ్ కుమార్ ప‌రిశీలించారు.

 National Anthem Will Be Sung Across Telangana Tomorrow , Telangana, National Ant-TeluguStop.com

మ‌రోవైపు హైద‌రాబాద్ లోని అన్ని కూడ‌ళ్ల వ‌ద్ద జాతీయ గీతాలాప‌నకు న‌గ‌ర ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.కూడ‌ళ్ల‌లో రోడ్డుకి అన్ని వైపులా ఉన్న రెడ్ సిగ్న‌ల్స్ వేస్తారు.

ఆ స‌మ‌యంలో అన్ని వాహ‌నాలు ఒక నిమిషం పాటు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోనున్నాయి.సామూహిక జాతీయ గీతాలాప‌న‌లో ప్ర‌తి వాహ‌న‌దారుడు పాల్గొనే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube