వ్యక్తిగత కారణాలతో జడ్జిలను విమర్శించడం సరికాదని జస్టిస్ యూయూ లలిత్ అన్నారు.జడ్జిలు కేవలం వారి జడ్జిమెంట్లు, ఆర్డర్ల ద్వారా మాత్రమే మాట్లాడతారని తెలిపారు.
కాబట్టి విమర్శలు కేవలం జడ్జిమెంట్లపై మాత్రమే ఉండాలన్నారు.జడ్జిమెంట్లపై కౌంటర్ వేసే అవకాశం కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేశారు.
జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని వెల్లడించారు.ఇటువంటి ప్రచారాలపై ప్రధాన న్యాయమూర్తులు వెంటనే ప్రతి స్పందించరని.
ఆ కారణంగా బలహీనతగా చూడకూడదని ఆయన హితవు పలికారు.అయితే ఈనెల 27న సర్వోన్నత న్యాయస్థానానికి సీజేఐగా ఎన్వీ రమణ నుంచి లలిత్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.







