తెలంగాణలో భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.దీనిలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.రేపు ఉదయం 11.30 గంటలకు గీతాలాపన చేయనున్నారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ అబిడ్స్ లోని జీపీవో కూడలి వద్ద గీతాలాపనలో పాల్గొననున్నారు.ఈ మేరకు అబిడ్స్ జీపీవో సర్కిల్, నెక్లస్ రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఏర్పాట్లను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు.
మరోవైపు హైదరాబాద్ లోని అన్ని కూడళ్ల వద్ద జాతీయ గీతాలాపనకు నగర ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.కూడళ్లలో రోడ్డుకి అన్ని వైపులా ఉన్న రెడ్ సిగ్నల్స్ వేస్తారు.
ఆ సమయంలో అన్ని వాహనాలు ఒక నిమిషం పాటు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి.సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతి వాహనదారుడు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.