పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం లైగర్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా చిత్ర బృందం వరంగల్ లో ఎంతో ఘనంగా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఇక ఈ సినిమా పూరి జగన్నాథ్ కు, విజయ్ దేవరకొండ కెరియర్లో భారీ బడ్జెట్ చిత్రం అని చెప్పాలి.ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఇందులో విజయ్ దేవరకొండ కోచ్ గా కనిపించనున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా కోసం వీళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి హాట్ టాపిక్ గా మారింది.

లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తీసుకున్నా రెమ్యూనరేషన్ భారీగానే ఉందని చెప్పవచ్చు.ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కన్నా మైక్ టైసన్ కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈయన సుమారు 40 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.







