సామాన్యులకు జలక్ ఇవ్వనున్న బ్రాడ్ బ్యాండ్ టారిఫ్ ధరలు..!

కొద్దిరోజుల క్రితమే అన్ని టెలికామ్ కంపెనీలు మొబైల్ రీచార్జ్ ధరలు అమాంతం పెంచేసి సామాన్య ప్రజలకు భారీ షాక్ ను ఇచ్చాయి.ముందుగా ఎయిర్‌టెల్, ఆ తర్వాత వొడాఫోన్ ,ఐడియా, చివరికి రిలయన్స్ ,జియో ఇలా అన్ని టెలికాం కంపనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచి కస్టమర్లకు షాకిస్తున్నాయి.

 Broadband Tariff Rates That Jalak Will Give To The Common Man Broadband, Connec-TeluguStop.com

ఇంకా ఈ షాక్ నుంచి ప్రజలు కోలుకోకముందే మరొక షాక్ కూడా రెడీ అయిపోయింది.అది ఏంటంటే.

టెలికామ్ సంస్థలు ఎలా అయితే ధరలు పెంచాయో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు కూడా ధరలు పెంచే ఆలోచన చేస్తున్నాయి.మరి కొన్నిరోజుల్లో కేబుల్, ఇంటర్నెట్ బిల్లుల రేట్లు కూడా పెరగనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు తక్కువ ధరలకే బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తున్న కంపెనీలు పెద్ద మొత్తంలో నష్టాల్లో కూరుకుపోయాయి అనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఒకవేళ ఇప్పుడు కనుక రేట్లు పెంచకపోతే మళ్ళీ మార్కెట్‌ లో నిలబడడం కష్టంగా మారుతుందని బ్రాడ్ బ్యాండ్ సంస్థలు చెబుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో బ్రాడ్ బ్యాండ్ రేట్లను పెంచేందుకు.మొబైల్ రీఛార్జి ధరలు ఏ స్థాయిలో అయితే పెరిగాయో, అంతే స్థాయిలో బ్రాడ్ బ్యాండ్ రేట్లను కూడా పెంచాలని కంపెనీలు అనుకుంటున్నాయట.

ఈ క్రమంలోనే బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు పెద్ద మొత్తంలో నష్టాలను చవిచూస్తున్నాయని, అలాగే తమ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు వివిధ రకాల కంపెనీల మధ్య పోటీ పెరిగిందని కోల్ కత్తా  కు చెందిన మేఘ్‌బెల్లా బ్రాడ్ బ్యాండ్ కో ఫౌండర్ తపవ్రతా ముఖర్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

Telugu Broadband, Latest-Latest News - Telugu

అందుకే రానున్న రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ రేట్లను కూడా 15% నుంచి 20% వరకు పెంచాల్సి ఉందన్నారు.అలాగే ఇప్పటివరకు ఓటీటీ స్ట్రీమింగ్ సేవలను తాము ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ప్రజలకు అందిస్తున్నాం అని, అలా చేయడం వలన ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల పై మరింత ఒత్తిడి పెరిగిందన్నారు.ఇప్పటివరకు చిన్న కంపెనీల మధ్య పోటీతత్వం తక్కువగానే ఉండేది కానీ.

ఎప్పుడయితే పెద్ద కంపెనీలు కూడా చిన్న సిటీల్లోకి వచ్చాయో అప్పుడు చిన్న కంపెనీల మధ్య కూడా పోటీ పెరిగిపోయింది.ఫలితంగా చిన్న బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు నష్టాల బాట వైపు పయనిస్తున్నాయి.

అలాగే కస్టమర్లకు మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలందించాలన్న కూడా తప్పనిసరిగా ఇంటర్నెట్ టారిఫ్‌ లను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి.మరి ఎప్పటినుంచి బ్రాడ్ బ్యాండ్ సేవల ధరలు పెరుగుతాయో అనే వివరాలు ఇంకా తెలియలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube