శోభన్ బాబు రిజెక్ట్ చేసిన కథలో వెంకటేష్.. ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే?

సాధారణంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలో మరో హీరో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపరు.విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Star Hero Venkatesh Shatruvu Movie Details, Shoban Babu-TeluguStop.com

ఆ సినిమాలలో శత్రువు ఒకటి కాగా శత్రువు సినిమాకు ముందు వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.శోభన్ బాబు నటించాల్సిన ఈ మూవీ ఆయన రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ వద్దకు చేరింది.

అయితే ఈ సినిమాను వెంకటేష్ ఓకే చెయ్యడానికి శోభన్ బాబు రిజెక్ట్ చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన ఎం.ఎస్.రాజుకు ఈ సినిమా తొలి సినిమా కావడం గమనార్హం.శత్రువు కథను ఎం.ఎస్.రాజు రాయగా కథ రాసిన వెంటనే ఈ సినిమాలో శోభన్ బాబు నటిస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారు.అయితే కథ నచ్చినా ఆ సినిమాలో నటించడం తనకు ఇష్టం లేదని శోభన్ బాబు ఎం.ఎస్.రాజుకు చెప్పారు.

నిర్మాత కావాలని ఎం.ఎస్.రాజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా శోభన్ బాబు సమర్థించలేదు.

Telugu Result, Raju, Raj Koti, Shatruvu, Shoban Babu, Shobhan Babu, Tollywood, V

సినిమాకు బదులుగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలని శోభన్ బాబు సూచనలు చేశారు.శత్రువు సినిమా సక్సెస్ సాధించకపోతే మనస్పర్ధలు వస్తాయని అందుకే తాను నటించలేనని శోభన్ బాబు ఎం.ఎస్.రాజుతో అన్నారని తెలుస్తోంది.ఆ తర్వాత ఎం.ఎస్ రాజు వెంకటేష్ ను ఒప్పించి ఆ సినిమాలో నటించేలా చేశారు.

Telugu Result, Raju, Raj Koti, Shatruvu, Shoban Babu, Shobhan Babu, Tollywood, V

రాజ్ కోటి ఈ సినిమాకు సంగీతం అందించగా కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకుడిగా పని చేశారు.ఈ సినిమా తర్వాత ఎం.ఎస్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ స్టేటస్ ను సొంతం చేసుకుని కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చారు.ఈ విధంగా శోభన్ బాబు రిజెక్ట్ చేసిన కథతో వెంకటేష్ సక్సెస్ సాధించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube