ఈ నడుమ అమ్మాయిల పట్ల జరుగుతున్న ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.ఎక్కడ చూసినా వారి మీద ఇలాంటి అమానుష ఘటనలు జరుగుతున్నాయి.
మరీ ముఖ్యంగా ఆకతాయిలు చేస్తున్న పనులకు అమ్మాయిల జీవితాలు సర్వ నాశనం అవుతున్నాయి.కొందరు అమ్మాయిలకు తెలియకుండా సీక్రెట్ కెమెరాలను వారి బాత్రూమ్ లలో లేదంటే పబ్లిక్ టాయిలెట్లలో అమర్చి వారి జీవితాలను పాడు చేస్తున్నారు.
ఇలాంటి విషయాలు ఇప్పటికే చాలా బయటకు వస్తున్నాయి.ఇప్పుడు కూడా హైదరాబాద్ లో జరిగిన ఘటన అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ లో జరిగింది ఈ ఘటన కొందరు యువకులు పాడు బుద్ధితో ఇలాంటి పని చేశారు.అడ్డంగా దొరికిపోవడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇంకేముంది వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు.కాగా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఫేమస్ అయిన ఓ మాల్ లో ఒక అమ్మాయి బట్టలు మార్చుకునేందుకు ట్రయల్ రూమ్ లోకి వెళ్లింది.
అక్కడ కెమెరాలు ఉండటం చూసి భయంతో కేకలు వేసింది.దీంతో ఏమైందో తెలుసుకునేందుకు మాల్ లో ఉన్న కస్టమర్లంతా అక్కడకు వచ్చారు.
అమ్మాయి రహస్య కెమెరాలను చూపించడంతో అంతా షాక్ అయిపోయారు.ఆమె కంటే ముందు చాలామంది ట్రయల్ రూమ్ లోకి వెళ్లారనే సమాచారం అందరినీ హడలెత్తిస్తోంది.ఆమె ఫిర్యాదుతో మాల్ యజమానులు కూడా అలర్ట్ అయిపోయారు.పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.కాగా వారి సెల్ ఫోన్ లలో రికార్డ్ అయిన వీడియోను డిలీట్ చేయించారు.కాగా ఇద్దరు యువకులను, అలాగే మాల్ యజమానిపై కేసులు బుక్ చేశారు పోలీసులు.
ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
.