కాంగ్రెస్ చేసిన ఈ తప్పే ప్రస్తుతం బీజేపీ చేస్తోందా?

రాజకీయాల్లో కీలకమైన సమయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి.అయితే చాలా వరకు అటువంటి సమయాల్లో వేసే తప్పటడుగులే సదరు పార్టీల పతనానికి కారణమవుతాయి.

 Is The Bjp Now Making This Mistake Made By The Congress , Bjp Party,a Bandi Sanj-TeluguStop.com

ఇందుకు చక్కటి ఉదాహరణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు.తెలంగాణ ఏర్పడిన సందర్భంలో కాంగ్రెస్ నాయకులందరు మంత్రి పదవులను పంచుకునే విషయంలో జరిగిన గొడవలు ఒక్కసారిగా అప్పటి  రాజకీయ వాతావరణంలో ఒక్కసారిగా అలజడి సృష్టించిన పరిస్థితి ఉంది.

ముఖ్యమంత్రి అభ్యర్థి నేనంటే నేనని ఇలా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన గొడవలు కేసీఆర్ కు చక్కని అవకాశంగా మారాయి.దీంతో తెలంగాణను ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ దక్కకుండా కేసీఆర్ కు ఆ క్రెడిట్ దక్కడం రెండు దఫాలుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Kishan, Etela Rajender, Telangana-Polit

అచ్చం అప్పుడు కాంగ్రెస్ లో  ఎలాగైతే జరిగిందో ఇప్పుడు బీజేపీలో కూడా ఇదే జరుగుతున్న పరిస్థితి ఉంది.హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఇక బీజేపీ తెలంగాణలో తమకు తిరుగులేదన్న రీతిలో వ్యవహరిస్తోందని, అందుకే ఇప్పుడే అధికారంలోకి వచ్చినట్టు సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఇప్పుడే చర్చ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ ప్రచారంపై బీజేపీ నాయకులు ఎక్కడా ఖండించలేదు కూడా.దీంతో ఈ ప్రచారంలో ఎంతో కొంత  నిజం ఉందని అందరూ చర్చించుకుంటున్నారు.అయితే ఈ ప్రచారాల్ని బీజేపీ కీలక నాయకులు తీవ్రంగా ఖండించకుంటే భవిష్యత్ లో ఇవి ప్రజల్లో చర్చనీయాంశంగా మారి బీజేపీ చేస్తున్న పోరాటం ప్రజలలోకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ.  ఈ తరహా ప్రచారం జరగడానికి వందకు వంద శాతం అవకాశం ఉందని ఎందుకంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ వీరు ముగ్గురి రాజకీయ అనుభవం సరిసమానమని అందుకే ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube